Home Blog Page 10

సిర్సన్న గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 

0

సిర్సన్న గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని సిర్సన్న గ్రామంలో కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యాధునిక డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు మంగళవారం పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ క్యాతం పోచక్క సురేష్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేశారు. పాత కాగితపు కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ వంటి భద్రతా ఫీచర్లతో కూడిన ఈ ప్లాస్టిక్ స్మార్ట్ కార్డులను అందుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దీపక్ గౌడ్, బీజేపీ మండల అధికార ప్రతినిధి మేంచు నరేందర్, మోహన్ రెడ్డి, సచిన్ రెడ్డి, రూపేష్, మదన్, లబ్ధిదారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

గణేష్ పూర్ లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన రూపేష్ రెడ్డి

0

గణేష్ పూర్ లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని గణేష్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవనాన్ని మంగళవారం గ్రామ సర్పంచ్ నాగరావ్ తో కలిసి యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూప్ రావు, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్ లు హాజయ్యారు. గ్రామ సర్పంచ్ టేకం నాగరావు,  యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఉన్నప్పుడే జరుగుతాయని అన్నారు.ప్రతి గ్రామానికి గ్రామపంచాయతీ భవనం ఎంతో అవసరమని తెలిపారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామపంచాయతీకి వచ్చి సంబంధిత అధికారులకు తెలియజేసే అవకాశం కూడా ఉంటుందని తెలియజేశారు.అదేవిధంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకొని ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మడావి జంగు, గ్రామపంచాయతీ కార్యదర్శి వామన్, బేల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూప్ రావు, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, మాజీ జడ్పీటీసీ రాందాస్, బేల మండల సర్పంచుల సంఘం అశోక్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్,, INTUC మండల అధ్యక్షుడు కన్య రాజు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు ఆడే శంకర్, కోలాం సంఘం జిల్లా అధ్యక్షుడు గోవింద్, సర్పంచులు జనార్ధన్, దౌలత్ రావు, ఉప సర్పంచుల మండల అధ్యక్షుడు సాగర్, మాజీ సర్పంచ్ జంగుశావ్, విజయ్, జీవన్, నవీన్ తదితరులు ఉన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా దర్బార్

0

ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా దర్బార్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపేందుకు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా దర్బార్ చక్కటి వేదికగా నిలుస్తుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా సేవా భవన్‌లో మంగళవారం ప్రజా దర్బార్ ను కంది శ్రీనివాస్ రెడ్డి నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను కంది శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ప్రతి సమస్యను ఓపికగా విన్న ఆయన, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా దర్బార్ ద్వారా ప్రతి ఒక్కరి గోడును నేరుగా తెలుసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, సర్పంచ్లు, ఉపసర్పంచూలు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శివయ్య ముదిరాజ్ ను పరామర్శించిన దుర్గం శేఖర్

0

శివయ్య ముదిరాజ్ ను పరామర్శించిన దుర్గం శేఖర్

చిత్రం న్యూస్, హైదరాబాద్: నెల రోజుల క్రితం హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్ర చేసుకొని హైదరాబాదులోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విశ్రాంతి తీసుకుంటున్న ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ జర్నలిస్టు సలేంద్ర శివయ్య ముదిరాజును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్, దుర్గం ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ దుర్గం శేఖర్ పరామర్శించారు. ఈ మేరకు మంగళవారం రోజు ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్లి శివయ్య ఆరోగ్య స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని దైనందిన జీవితంలో ప్రజా జీవితంలో మళ్లీ యధావిధిగా ప్రయాణం సాగించాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు శివయ్య మిత్రబృందం గడ్డం అశోక్ (రిటైర్డ్ ఆర్మీ),దీపక్ అగర్వాల్ LIC (జనరల్ సెక్రటరీ), బోయర్ విఠల్, జి. జలపాతి, చిక్కాల ఆశన్న,మహమ్మద్ అలీ (హైకోర్టు అడ్వకేట్) సభ్యులతో పాటు గోదావరి ఖనికి కి చెందిన ముదిరాజ్ సంఘం రాష్ట్ర సుంకరి పోతరాజు, జర్న లిస్ట్ సంఘం నాయకులు గువ్వ తిరుపతి ముదిరాజ్ ఉన్నారు.

సిర్సన్న గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

0

సిర్సన్న గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

చిత్రం న్యూస్, బేల: మండలంలోని సిర్సన్న గ్రామంలో కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యాధునిక డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ మంగళవారం చేశారు. గ్రామ సర్పంచ్ క్యాతం పోచక్క సురేష్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేశారు. పాత కాగితపు కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ వంటి భద్రతా ఫీచర్లతో కూడిన ఈ ప్లాస్టిక్ స్మార్ట్ కార్డులను అందుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దీపక్ గౌడ్, మోహన్ రెడ్డి, సచిన్ రెడ్డి, నందు, రూపేస్, మధన్, లబ్ధిదారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ కె.దివ్యకు ఉత్తమ లెక్చరర్ అవార్డు

0

కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ కె.దివ్యకు ఉత్తమ లెక్చరర్ అవార్డు

చిత్రం న్యూస్, భైంసా: భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న  కె.దివ్యకు ఉత్తమ లెక్చరర్ అవార్డు (Best Lecturer Award) లభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2026 ఆగస్టు 15న చీఫ్ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా చేతుల మీదుగా ఆమె ఈ ఉత్తమ లెక్చరర్ ప్రశంసా పురస్కారాన్ని అందుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు, కళాశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతికి ఆమె అందిస్తున్న సేవలను గుర్తించి ఈ Best Lecturer Awardను అందజేశారు.

ఈ సందర్భంగా కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ డా.భీమా రావు, వైస్ ప్రిన్సిపాల్ డా. రఘునాథ్, IQAC కోఆర్డినేటర్ డా.రవి కుమార్, సీనియర్ అధ్యాపకులు డా. పవన్ పాండే, డా. ఎం. శంకర్, రాజు, ఆర్.ఈ., డా. ఓం ప్రకాశ్, డా. కల్పన, డా. నహీదా, రాజయ్య, సురేందర్ తదితర అధ్యాపకులు కె. దివ్యను అభినందించారు.

గండ్రత్ సుజాతను కలిసిన మేకల జితేందర్

0

గండ్రత్ సుజాతను కలిసిన మేకల జితేందర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్‌గా నియమితులైన మేకల జితేందర్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జితేందర్ ను శాలువాతో గండ్రత్ సుజాత సన్మానించారు. పార్టీ బలోపేతానికి, అప్పగించిన బాధ్యతలకు కట్టుబడి పనిచేస్తానని జితేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ మల్లయ్య , పోచన్న, రూరల్ మండల అధ్యక్షులు వెంకటి యాదవ్, తుడం వినోద్, చౌదరి వినోద్, కార్తీక్  పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జితేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిసిన ఎస్టీ పర్ధాన్ సంఘం నాయకులు

0

ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిసిన ఎస్టీ పర్ధాన్ సంఘం నాయకులు

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలో ఎస్టీ పర్ధాన్ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయమై ఆదివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ రాకేష్ రెడ్డి, జైనథ్ వార్డు మెంబర్ కోవా సారథి, అశోక్, సత్యనారాయణ, తులసి రామ్, నాగేష్, యోగేష్, నరేష్, ఆకాష్, లక్మన్, కిషోర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

పెన్ గంగా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

0

పెన్ గంగా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన కన్నె పవన్ కుమార్ అనే యువకుడు శనివారం పెన్ గంగా నదిలో పడి గల్లంతైన సంగతి తెలిసిందే. కాగా.. ఆదివారం నదిలో అతని మృతదేహం లభ్యమైంది.  దీంతో గ్రామంలో  విషాదం చోటుచేసుకుంది. యువకుడు నదిలో గల్లంతయిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రంగంలోకి దిగాయి. శనివారం నుండి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం కౌట గ్రామం సమీపంలో పవన్ కుమార్ మృతదేహం దొరికినట్లు జైనథ్ ఎస్ఐ (SI) పవర్ గౌతమ్ తెలిపారు. మృతుడు పవన్ కుమార్‌కు భార్య, ఓ పాప ఉన్నారు. చేతికి వచ్చిన కొడుకు, ఇంటికి యజమాని అయిన పవన్ నదిలో పడి మరణించడంతో ఉమ్రి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. భార్య, కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పవన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా, ప్రమాదవశాత్తు మృతిచెందాడ అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ జెండాను ఎగరేయని టీజీబీ బ్యాంక్‌ మేనేజర్‌పై ఫిర్యాదు

0

జాతీయ జెండాను ఎగరేయని టీజీబీ బ్యాంక్‌ మేనేజర్‌పై ఫిర్యాదు

చిత్రం న్యూస్, జైనథ్: దేశమంతటా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తుంటే, జైనథ్ మండలం కరంజి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)లో శనివారం మువ్వన్నెల జెండా ఎగరలేదు. జెండా పండగకు రావాలని స్థానిక నేతలు ఫోన్ చేయగా.. జెండా ఎగురవేసే పనిలేదని బ్యాంక్ మేనేజర్ మంగేశ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు, నేతలు బిక్కి గంగన్న,  ఎల్టి జగదీశ్ రెడ్డి, దర్శనాల అశోక్ లు బ్యాంక్ మేనేజర్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జైనథ్ ఎస్ఐ గౌతమ్ పవార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.