Home Blog

పుష్కరాల పనులన్నీ శాఖల సమన్వయంతో చేపట్టాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

0

*బాసరలో పుష్కరాల పనులపై అధికారులతో సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరి పుష్కరాల పనులన్నీ శాఖల మధ్య సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి బాసర ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల పనులపై సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..బాసరలో పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు, వీఐపీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, సంఖ్య లెక్కింపు అంశాల్లో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలన్నారు. చేపట్టే పనులను సంబంధిత ఇంజినీరింగ్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పనులన్నీ నాణ్యవంతంగా ఉండాలని స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. భక్తుల రద్దీ మేరకు తగినన్ని ఆర్టీసీ బస్సులు నడపాలని వివరించారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని, హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. పుష్కరాలకు వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పిస్తామని అన్నారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయంతో ఉండి, భక్తులకు ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ తరపున సహకారం అందిస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, కేంద్రీకృత విధానం ద్వారా నిఘా ఉంచుతామని అన్నారు. సీసీ కెమెరాల సహాయంతో భక్తుల భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. తగినంత మంది పోలీసు సిబ్బందిని పుష్కరాలకు కేటాయిస్తామని ఎస్పీ అన్నారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ఈఈ లు సుభాష్, సందీప్, శంకరయ్య, అనిల్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జైనథ్‌లో అంగరంగ వైభవంగా పొలాల అమావాస్య వేడుకలు

0

* వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

*ఉత్తమంగా అలంకరించిన ఎడ్లకు బహుమతులు అందజేసిన ఎస్పీ

  1. చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలో పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలిపారు. రైతులు తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. జైనథ్‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. అనంతరం రైతులు తమ ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించి నిర్వహించిన వేడుకలను వీక్షించారు. రైతులు కలిసికట్టుగా ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవడం అభినందనీయమన్నారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. వ్యవసాయంలో రైతులకు ఎంతో తోడ్పాటునందించే పశువులను గౌరవించడం మన సంప్రదాయంలో భాగమన్నారు. ఎడ్లను అత్యంత ఆకర్షణీయంగా అలంకరించిన రైతులకు గ్రామపంచాయతీ తరఫున ప్రకటించిన బహుమతులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ ఎస్ఐ పి. గౌతమ్, సర్పంచ్ గడ్డం మమత జగదీశ్ రెడ్డి, గ్రామ  పెద్దలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

0

* విదేశీ విద్యకు బాటలు: జిల్లా కలెక్టర్ రాజర్షిషా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  విదేశాల్లో ఉన్నత విద్య (మాస్టర్స్/డాక్టరేట్) అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి” పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఆగస్టు/సెప్టెంబర్ (ఫాల్ సెషన్)‌కు సంబంధించి ఈ ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ పథకం కింద మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఇందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉండాలని, దరఖాస్తు చేసే సమయానికి వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదని పేర్కొన్నారు. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో పాటు, జిఆర్‌ఇ (260 మార్కులు) లేదా జి-మ్యాట్ (500 మార్కులు), టోఫెల్ (60 మార్కులు) లేదా ఐఇఎల్‌టిఎస్ (6.0) లేదా పిటిఇ (50 మార్కులు) పరీక్షలలో ఏదో ఒకదానిలో అర్హత సాధించి ఉండాలని అర్హతలను వివరించారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు http://www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ పై వినూత్న అభిమానాన్ని చాటిన రైతులు

0

మాజీ సీఎం కేసీఆర్ పై వినూత్న అభిమానాన్ని చాటిన రైతులు

చిత్రం న్యూస్, జైనథ్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై ఉన్న అభిమానాన్ని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు వినూత్న రీతిలో చాటుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగే ‘పొలాల అమావాస్య’ (పోలా) పండుగ వేడుకల్లో భాగంగా జైనథ్ మండలం కరంజి (కె) గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ ఎడ్లను గులాబీ రంగు బ్యానర్లతో ముస్తాబు చేశారు. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను గుర్తుచేసుకుంటూ, తమ కాడెద్దులకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జోగు రామన్నల చిత్రాలతో కూడిన గులాబీ రంగు వస్త్రాలను కప్పి గ్రామంలో ఊరేగించారు. “మళ్లీ రావాలి కేసీఆర్.. రైతన్నకు భరోసా.. పేదలకు ఆశా..” అంటూ బ్యానర్లపై రాసి ఉన్న నినాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడిపై పండుగ వేళ రైతన్నలు ప్రదర్శించిన ఈ రాజకీయ అభిమానం ఇప్పుడు స్థానికంగానే కాకుండా, సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. గులాబీ శ్రేణులు, నెటిజన్లు ఈ ఫోటోలను షేర్ చేస్తూ రైతుల అభిమానానికి ఫిదా అవుతున్నారు.

ఎన్‌ఎస్‌యూఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా జంగం శశిధర్ 

0

ఎన్‌ఎస్‌యూఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా జంగం శశిధర్ 

చిత్రం న్యూస్ బాసర : నిర్మల్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా జంగం శశిధర్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకట స్వామి, జాతీయ లీగల్ సెల్ కన్వీనర్ ఎం.డి. అక్బర్, అరవింద్ కుమార్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమక్షంలో జంగం శశిధర్‌కు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా జంగం శశిధర్‌ను నాయకులు ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐని మరింత బలోపేతం చేసి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జంగం శశిధర్ మాట్లాడుతూ..తనపై నమ్మకం ఉంచి నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర మరియు జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, జిల్లాలోని విద్యార్థుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని జంగం శశిధర్‌కు అభినందనలు తెలిపారు.

ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ రాజర్షిషా

0

ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ రాజర్షిషా

చిత్రం న్యూస్, ఉట్నూర్: నర్సాపూర్ (బి) గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ (బి) గ్రామంలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

గ్రామంలో రెడ్కో (REDCO) ఆధ్వర్యంలో జరుగుతున్న సోలార్ ప్లాంటేషన్ సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి, స్టోర్‌రూమ్, వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజన నాణ్యతపై ఆరా తీసి, నిల్వ ఉంచిన సరుకులను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ పౌష్టికాహారాన్ని అందించాలని, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ కే. ప్రణయ్‌కుమార్, తహసీల్దార్ రఘునాథ్ రావు, మండల స్థాయి అధికారులు, రెడ్కో ప్రతినిధులు శ్రీనివాస్, హౌసింగ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

సనాతన హిందూ సేవా సమితి 2వ వార్షికోత్సవ వేడుకలు 

0

సనాతన హిందూ సేవా సమితి 2వ వార్షికోత్సవ వేడుకలు 

చిత్రం న్యూస్, వరంగల్: సనాతన హిందూ సేవా సమితి 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 232వ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ కరీమాబాద్ లోని గోశాలలో గోమాతలకు 100 కిలోలా దాణాను సమితి సభ్యులు అందజేశారు. సేవ అనే నినాదంతో గత రెండేళ్లుగా నిరంతర సేవా కార్యక్రమాలు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, సలహాదారు అంచూరి వేణుగోపాల్, సభ్యులు గంగిడి ధర్మారెడ్డి, బండారి సంపత్, ఆకుతోట కిరణ్, విరాటి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

NSUI రాష్ట్ర కార్యదర్శిగా సూద్దోళ్ల గంగప్రసాద్

0

* అతి చిన్న వయసులోనే  వరించిన రాష్ట్ర స్థాయి పదవి  

చిత్రం న్యూస్ బాసరవిద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడే నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన యువ నాయకుడు సూద్దోళ్ల గంగప్రసాద్‌కు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు దక్కాయి. ప్రతిష్టాత్మక విద్యార్థి సంఘం అయిన NSUI (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా (స్టేట్ సెక్రటరీ) నియమించింది. ఒక సాధారణ కార్యకర్తగా, మండల స్థాయి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంగప్రసాద్.. విద్యార్థుల సమస్యలపై ఎల్లప్పుడూ గళం విప్పుతూ, రాజీలేని పోరాటాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందడం ఆయన నాయకత్వ లక్షణాలకు, అంకితభావానికి నిదర్శనం.

డీసీసీ ఉపాధ్యక్షులు మమ్మాయి రమేష్ కు కృతజ్ఞతలు

ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి తాను ఈ రోజు రాష్ట్ర స్థాయికి ఎదగడంలో నిరంతరం వెన్నంటి ఉండి, తనను ఎంతగానో ప్రోత్సహించి సహకరించిన డీసీసీ (DCC) ఉపాధ్యక్షులు శ్రీ మమ్మాయి రమేష్ కు ఈ సందర్భంగా గంగప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.

భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ 

0

భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ 

చిత్రం న్యూస్, బాసర: భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ  అనిరజక సంఘం అధ్యక్షుడు ఇస్త్రీ గంగాధర్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా  బాసర మండల కేంద్రంలోని రజక సంఘం సభ్యులు, గ్రామస్తులు కలిసి విగ్రహం వద్ద పూలమాల వేసి ఆ యోధురాలికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు ఇస్త్రీ గంగాధర్, పోశెట్టి వార్డ్ మెంబర్ నాగలక్ష్మి అశోక్, నరేందర్ మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీకి, నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, పేదలు,బలహీన వర్గాల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం, హక్కుల కోసం పోరాడే సంకల్పం, సమాజ శ్రేయస్సు కోసం నిలబడే నిబద్ధత మనందరిలో ఉండాలని చాకలి ఐలమ్మ జీవితం మనకు చాటి చెబుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సంజీవ్ పూజారి, జంగం రాజేందర్,మాజీ ఎంపీటీసీ పోతన్న,మాజీ వార్డ్ మెంబర్ యోగేష్ చారి, ముత్యం,శ్రీనివాస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎమ్మేవార్ విజయ్ కుమార్ ,నర్సూరి భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.

పొనాల ప్రాథమిక పాఠశాలలో ఆట వస్తువులలు పంపిణీ చేసిన సామ రూపేష్ రెడ్డి

0

పొనాల ప్రాథమిక పాఠశాలలో ఆట వస్తువుల పంపిణీ చేసిన సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని పొనాల గ్రామ ప్రాథమిక పాఠశాలలో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి విద్యార్థులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. తన సొంత నిధులతో విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచే ఉద్దేశంతో క్రీడా పరికరాలను అందజేయగా, ఉపాధ్యాయులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, చిన్న వయస్సు నుండే క్రీడల వైపు దృష్టి సారించేలా ఈ పంపిణీ చేపట్టామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని, తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మేకల జితేందర్, విజయ్, యువ నాయకుడు మంచికంటి నవనీత్, బీర్షావ్, ప్రధానోపాధ్యాయుడు అశోక్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.