భుక్తాపూర్ విద్యుత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ (భుక్తాపూర్): ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ లోని విద్యుత్ డివిజన్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించిన కలెక్టర్, సిబ్బంది హాజరు పట్టికలను (అటెండెన్స్ రిజిస్టర్లు) క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యుత్ సరఫరాకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్, జిల్లాలో విద్యుత్ పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారుల పనితీరుపై ఆరా తీసిన ఆయన, రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు.

