Home Blog Page 11

గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు: ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

0

గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు: ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

చిత్రం న్యూస్, సాత్నాల: గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు: మంజూరు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వీబీ జీరాంజీ పథకం నిధులు రూ:20 లక్షలతో సాత్నాల మండలం దౌన, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ కోసం ఆదివారం పూజా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సైద్పూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం భూమిపూజ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ చేలకు వెళ్లడానికి పొలంబాట చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వీబీ జీరాంజీ పథకం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగ పడుతుందని, ఈ పథకాన్ని సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో రైతులు పండించిన పంటను నిల్వ చేయడానికి చిన్న గోదాంలను నిర్మించుకోవడానికి అవకాశం వచ్చిందన్నారు. ఆయన వెంట నాయకులు ఎల్టి అశోక్ రెడ్డి, అస్తక్ సుభాష్, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ డిపార్టుమెంటు వైస్ ఛైర్మన్  దుర్గం శేఖర్ 

0

టీపీసీసీ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ డిపార్టుమెంటు వైస్ ఛైర్మన్  దుర్గం శేఖర్ 

చిత్రం న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్  నాంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ నాయకులు సచిన్ సావంత్ లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. వేడుకల్లో టీపీసీసీ ఎస్సీ డిపార్టుమెంటు వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి వేడుకల్లో పాల్గొని… టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. సచిన్ సావంత్. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఆరెపల్లి రాజేందర్, వినోద్ సింగ్, విజయ్ తదితరులకు దుర్గం శేఖర్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

వన మహోత్సవాన్ని ప్రారంభించిన పెద్దాపురం  ఏడవ అదనపు  జిల్లా జడ్జి సరస్వతి

0

వన మహోత్సవాన్ని ప్రారంభించిన పెద్దాపురం  ఏడవ అదనపు  జిల్లా జడ్జి సరస్వతి

చిత్రం న్యూస్, పెద్దాపురం:  స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దాపురం కోర్టు ప్రాంగణంలో  ఏడవ అదనపు జిల్లా జడ్జి N. సరస్వతి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కలు నాటడం వల్ల  పెరుగుతున్న కాలుష్యాన్ని కొద్ది వరకైనా తగ్గించవచ్చని అన్నారు.  తన చేతుల మీదుగా మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయండి: PRTUTS జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణకుమార్

0

ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయండి: PRTUTS జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణకుమార్

చిత్రం న్యూస్, జైనథ్: సెప్టెంబర్ 1న హైదరాబాదులో నిర్వహించే ఉపాధ్యాయుల ధర్నాకు పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని PRTUTS జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నరసింహ స్వామి అన్నారు. PRTUTS జైనథ్ మండల శాఖ సర్వసభ్య సమావేశం స్థానిక ప్రాథమిక పాఠశాల జైనథ్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు PRC వెంటనే ప్రకటించాలన్నారు. 2026-28 సంవత్సరపు నూతన కార్యవర్గాని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చిలుకూరి బాపురావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులుగా M. ఇస్తారి, మహిళా అసోసియేట్ అధ్యక్షులుగా సుజాత, ఉపాధ్యక్షులుగా అనిల్, మహిళా ఉపాధ్యక్షులుగా అరుణకుమారి,  కార్యదర్శులుగా కైలాస్,అన్వేష్, మహిళా కార్యదర్శులుగా సరిత, వందనలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారికి జిల్లా శాఖ పక్షాన సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధికి పెద్దపీట

0

* పిట్టబొంగారంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

* ‘ఆరు సూత్రాల’ ప్రణాళికతో గిరిజన గ్రామాల రూపురేఖలు మారుస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి గిరిజన గ్రామం మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, వ్యవసాయాభివృద్ధి, మహిళా సాధికారతతో ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవాలన్నదే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల పిట్టబొంగారం గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో మంద మకరందు తో కలిసి జిల్లా కలెక్టర్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి కొత్త రూపు తీసుకొచ్చే పలు మౌలిక వసతులను ప్రజలకు అంకితం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన ప్రహరీ గోడ, పర్ధాన్ కమ్యూనిటీ హాల్, నూతన గ్రామపంచాయతీ భవనం, నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ఐటీడీఏ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ‘ఆరు సూత్రాల అభివృద్ధి ప్రణాళిక’ను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకునేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో మాతా–శిశు మరణాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి గర్భిణి రిమ్స్ ఆసుపత్రిలో టిఫా స్కాన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణిపై ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

గిరిజన విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకు FLN, 6 నుంచి 10వ తరగతి వరకు LIP కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో నెలకొనే సమస్యలను తక్షణమే పరిష్కరించి మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు.

వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు జలసిరి పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో వ్యవసాయ కుంటలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పథకం కింద రూ.90 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ఆర్థిక సహాయం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. లావుని పట్టా భూములకు సంబంధించిన బ్యాంకు రుణాల సమస్యలను ఎంఆర్‌వోల ద్వారా తక్షణమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించి అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు మాట్లాడుతూ, మారుమూల గిరిజన గ్రామాలకు, పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. పిహెచ్‌సీ ప్రహరీ గోడతో ఆసుపత్రికి రక్షణ మెరుగుపడుతుందని, కమ్యూనిటీ హాల్ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ, గిరిజన ప్రజల సంక్షేమానికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, సర్పంచ్ మాదవి ఇంద్రదేవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి వనిత, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

0

ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే రైతులు సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం శంకర్‌గూడ గ్రామంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ఏపీఓ మంద మకరంద్‌తో కలిసి గ్రామంలో స్వయంగా ఆయిల్ పామ్ మొక్కలను నాటి రైతులను ప్రోత్సహించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఒకసారి ఆయిల్ పామ్ తోటను ఏర్పాటు చేస్తే సుమారు 25 నుంచి 30 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పంట ద్వారా రైతులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఇతర ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక లాభాలు పొందాలని రైతులకు సూచించారు.

ఐటీడీఏ ఏపీఓ మంద మకరంద్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన మొక్కలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టి ఆదాయాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా ఉద్యాన అధికారి సందీప్ కుమార్, స్థానిక సర్పంచ్, వ్యవసాయ, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

గ్రామాల భద్రతకు సీసీటీవీలు కీలకం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

0

గ్రామాల భద్రతకు సీసీటీవీలు కీలకం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

* చెప్రాల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

చిత్రం న్యూస్, బేల: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మూడు గ్రామాల్లో 35 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. అందులో భాగంగానే బేల మండలం చెప్రాల గ్రామంలో 15, సిర్సన్నలో 16, ఎకోరిలో 4 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీసీటీవీ నిఘా ఎంతో కీలకమని ఎస్పీ తెలిపారు. గ్రామాలు సీసీటీవీ నిఘాలో ఉంటే నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్థులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందన్నారు. గ్రామ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, సీసీటీవీల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా చెప్రాల గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపను ఎస్పీ ప్రారంభించారు. ఈ క్యాంపులో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నిష్ణాతులైన ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులు ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, డెంటల్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజీ తదితర విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్స అందించారు. దీర్ఘకాలికంగా కంటి సమస్యలున్న 20 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ప్రజల భద్రతతో పాటు ఆరోగ్య పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. 500 పైగా పాల్గొన్న గ్రామ ప్రజలు యువత ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవడం ఆనందకరమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ శ్రావణ్ కుమార్, ఎస్ఐ మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: 7వ అదనపు జిల్లా జడ్జి ఎన్. సరస్వతి

0

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: 7వ అదనపు జిల్లా జడ్జి ఎన్. సరస్వతి

చిత్రం న్యూస్, పెద్దాపురం: సెప్టెంబర్ 12న జరిగే నేషనల్ లోక్  అదాలత్ ను  కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని,రాజీ మార్గమే రాజ మార్గమని 7వ అదనపు జిల్లా జడ్జి  ఎన్. సరస్వతి అన్నారు. పెద్దాపురం కోర్టు హాల్ లో శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న  యాక్సిడెంట్, సివిల్, క్రిమినల్ కేసులు వంటివి పరిష్కరిస్తారని తెలిపారు. పరిష్కార కేసులు: రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద నష్టపరిహారం, బ్యాంక్ రికవరీ, కార్మిక వివాదాలు, సివిల్ వివాదాలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. రాజీపడిన కేసులకు కోర్టు ఫీజు పూర్తిగా వాపస్ ఇవ్వబడుతుందన్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరి తక్షణ సత్వర న్యాయం లభిస్తుందని, దీనిపై ఎటువంటి అప్పీల్ ఉండదన్నారు.

అనుమానాస్పదంగా చిరుత మృతి

0

చిత్రం న్యూస్, చంద్రాపూర్: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సిందేవాహి అటవీ క్షేత్రం నవర్గావ్_పెండ్రి రోడ్డు పక్కన మూడేళ్ల చిరుతపులి అనుమానస్పదంగా మృతిచెందింది. గ్రామస్తులకు ఉదయం నీరసంగా కనిపించిన చిరుతపులి లేచి నడిచేందుకు ప్రయత్నించి అక్కడే కుప్పకూలింది. చిరుత మృతిపై అటవీశాఖ అధికారులు ఆరాతీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మృతికి కారణాలు తెలియనుంది.

 

బేలకు రెండో విడత ఇళ్లలో ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు వినతి

0

బేలకు రెండో విడత ఇళ్లలో ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు వినతి

చిత్రం న్యూస్, బేల: రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియలో భాగంగా బేల మండల కేంద్రంలోని నిరుపేదలకు ఎమ్మెల్యే కోటా కింద అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక వార్డు సభ్యులు, నాయకులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కోరారు. ఇళ్లు లేని అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని 11వ వార్డులో గల విట్టల్–రుకుంబాయి మందిరం వెనకాల నూతన డ్రైనేజీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ప్రస్తుతం అక్కడ ఉన్న డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు సభ్యులు నవీన్, సతీష్, మాడ హరీష్ రెడ్డి, జఫర్ తదితరులు పాల్గొన్నారు.