ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుర్గం శేఖర్
చిత్రం న్యూస్, హైదారాబాద్: రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ పాల్గొని, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ ని దుర్గం శేఖర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










