-Advertisement-

భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ 

భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ 

చిత్రం న్యూస్, బాసర: భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ  అనిరజక సంఘం అధ్యక్షుడు ఇస్త్రీ గంగాధర్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా  బాసర మండల కేంద్రంలోని రజక సంఘం సభ్యులు, గ్రామస్తులు కలిసి విగ్రహం వద్ద పూలమాల వేసి ఆ యోధురాలికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు ఇస్త్రీ గంగాధర్, పోశెట్టి వార్డ్ మెంబర్ నాగలక్ష్మి అశోక్, నరేందర్ మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీకి, నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, పేదలు,బలహీన వర్గాల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం, హక్కుల కోసం పోరాడే సంకల్పం, సమాజ శ్రేయస్సు కోసం నిలబడే నిబద్ధత మనందరిలో ఉండాలని చాకలి ఐలమ్మ జీవితం మనకు చాటి చెబుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సంజీవ్ పూజారి, జంగం రాజేందర్,మాజీ ఎంపీటీసీ పోతన్న,మాజీ వార్డ్ మెంబర్ యోగేష్ చారి, ముత్యం,శ్రీనివాస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎమ్మేవార్ విజయ్ కుమార్ ,నర్సూరి భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments