Home Blog Page 3

దుబ్బగూడ ఆసుపత్రిలో ఎన్సీడీపై సమీక్షా సమావేశం 

0

దుబ్బగూడ ఆసుపత్రిలో ఎన్సీడీపై సమీక్షా సమావేశం 

చిత్రం న్యూస్, మావల: మావల మండలంలోని దుబ్బగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం జిల్లా NCD అధికారిణి డా. సుమలత ఆధ్వర్యంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD) పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న డేటాను వెంటనే పూర్తి చేయాలని, ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) కార్డులను పూర్తి చేయాలని ఆదేశించారు. బీపీ, షుగర్ కేసులకు పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందించి, మందులు క్రమం తప్పకుండా వాడితేనే రోగం నయమవుతుందని, ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడే వారి పూర్తి వివరాలు తమ వద్ద ఉండాలని సూచించారు. ప్రతి సబ్ సెంటర్ ANM లు, MLHP లు ఈ నెల 20వ తేదీలోగా పనులు పూర్తి చేయకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో PHC ఆంకోలి NCD నోడల్ పర్సన్ బొమ్మెత సుభాష్, MLHPలు అగ్గిమల్ల అంజలి, కృష్ణవేణి, రోజారమణి, పూనమ్, సౌజన్య, ఆరోగ్య సహాయకులు నల్ల ఈశ్వర్ రెడ్డి, తార, లలిత, సంగీత, సునీత, శ్రీవాణి, మమత, శకుంతల, సజిదా, శ్రీదేవి, మమత, దుబ్బగూడ ఆసుపత్రి సిబ్బంది ఇర్ఫానా, చంద్రకళ, శృతి, రిహాజ్, రత్న, శాంత తదితరులు పాల్గొన్నారు.

వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

0

వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

చిత్రం న్యూస్ బాసర :  వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల అన్నారు.  సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రానున్న వినాయక ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అన్ని మతాల పండుగలు సహోదర భావంతో, కలిసి మెలసి జరుపుకోవాలన్నారు. వినాయక ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాలు మొత్తం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వైర్లను సరి చేస్తామని చెప్పారు. ఉత్సవ నిర్వాహకులు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తమ వంతుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపడతామన్నారు. అలాగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేసి శోభాయాత్రకు అనుకూలంగా మారుస్తామని వివరించారు. వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు

          వినాయక ఉత్సవాలు శాంతియుతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం: జిల్లా ఎస్పీ జానకి షర్మిల

ఈ సమావేశంలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ..జిల్లాలో గణేష్ ఉత్సవాలు మొత్తం ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీసు శాఖ తరుపున తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వేడుకలకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంబంధిత అధికార యంత్రాంగంతో పోలీసు శాఖ సమన్వయంతో పని చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినాయక ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేలా చూస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, డిఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, శాంతి కమిటీ సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

శ్రావణ మాసం పురస్కరించుకొని కేఆర్కే కాలనీలో నగర భోజనం

0

శ్రావణ మాసం పురస్కరించుకొని కేఆర్కే కాలనీలో నగర భోజనం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గతకొన్ని సంవత్సరలుగా ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో 7వ, 8వ వార్డుల్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద భజన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా శ్రావణ సోమ వారం పురస్కరించుకొని 7వ వార్డు కౌన్సిలర్ దుమ్మని రాము, 8వ వార్డు కౌన్సిలర్ నాగసెన్ మాన్కర్ లు పూజా కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. అనంతరం నగర భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు లింగంపల్లి శశికాంత్, దేవాంత రమేష్, రవి, ముసలే ఈశ్వర్, ఎల్చాల పోచన్న, ఆలయ కమిటీ సభ్యులు బోడకుంట రాజు, సుభాష్, నవీన్, సార్ల బుజ్జన్న, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

బాసరలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

0

బాసరలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

చిత్రం న్యూస్ బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం గోదావరి బాసర ఘాట్ వద్ద రూ.20 కోట్లతో చేపట్టనున్న పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు, బాసర వరలక్ష్మి ఆశ్రమం సమీపంలో శ్రీశ్రీశ్రీ దశరథ మహారాజు విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించి పనులకు శ్రీకారం చుట్టారు. బాసర ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రివ్యూ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాసరకు వచ్చే భక్తులకు, ముఖ్యంగా అక్షరాభ్యాసం కోసం వచ్చే పిల్లలు, తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, గోదావరి ఘాట్ వద్ద భక్తుల రక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ స్నానఘాట్ల విస్తరణ, లైటింగ్, దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని, రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు.

కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, జడ్పీ చైర్మన్ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాల్ చారి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, ఏఎస్పీ సాయికిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు.

గురుజ గ్రామంలో జగదాంబ, సేవాలాల్ ఆలయాలను దర్శించుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్

0

గురుజ గ్రామంలో జగదాంబ, సేవాలాల్ ఆలయాలను దర్శించుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్

చిత్రం న్యూస్, గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలం గురుజ గ్రామస్తుల పిలుపు మేరకు డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్ ఆదివారం గ్రామంలోని జగదాంబ, సేవాలాల్ ఆలయాలను దర్శించుకున్నారు. ముందుగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జగదాంబ అమ్మవారిని, సేవాలాల్ మహారాజ్ ను దర్శించుకుని, అమ్మవారి ఆశీస్సులతో, సేవాలాల్ మహారాజ్ కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు రాథోడ్ గణేష్, దుబ్బాక నరేష్, సిడాం శంకర్, బాలు శంకర్ తదితర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గాంధీభవన్‌లో ఏఐసీసీ నేత కొప్పుల రాజుకు స్వాగతం పలికిన దుర్గం శేఖర్

0

గాంధీభవన్‌లో ఏఐసీసీ నేత కొప్పుల రాజుకు స్వాగతం  పలికిన దుర్గం శేఖర్ 

* ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం

చిత్రం న్యూస్ , హైదరాబాద్: గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు, జార్ఖండ్ కాంగ్రెస్ ఇంఛార్జి కొప్పుల రాజు హాజరయ్యారు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కొప్పుల రాజుకి ఘన స్వాగతం లభించింది. టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌లతో కలిసి ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్, ఇతర నేతలు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, సామాజిక న్యాయం సాధన, రాజ్యాంగ పరిరక్షణ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడం, సామాజిక న్యాయం కోసం సమిష్టిగా పనిచేయడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై బాసరలో బీఆర్ఎస్ పార్టీ నేతల నిరసన 

0

కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై బాసరలో బీఆర్ఎస్ పార్టీ నేతల నిరసన 

చిత్రం న్యూస్ బాసర : కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం బాసర మండలం లాబ్ది గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు డాక్టర్ పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో పరిసరాల పరిశుభ్రతను చేపట్టి తమ నిరసనను తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మోసపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అంటూ బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు నినాదాలుచేశారు. యువత, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.

సమరసతతో కూడిన సమాజ నిర్మాణమే ముఖ్య లక్ష్యం: సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ 

0

సమరసతతో కూడిన సమాజ నిర్మాణమే ముఖ్య లక్ష్యం: సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ 

చిత్రం న్యూస్, నిజామాబాద్:  సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతి ఉత్సవాలలో భాగంగా సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో సమరసత శిక్షణా తరగతుల కార్యక్రమం ఉత్తర తిరుపతి దేవస్థానం, గంగస్థాన్, ఫేజ్-2 నిజామాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ హాజరై సామాజిక సమరసత ఆవశ్యకత, హిందూ సమాజంలో సమైక్యత గురించి వివరించారు. సమాజంలో వివక్షత, అసమానతలు లేకుండా సమరసతతో కూడిన సమాజ నిర్మాణమే ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బెండ లచ్చన్న, ఇందూర్ విభాగ్ సహ సంయోజక్ రావుత్ రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రమేష్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు అశోక్ భోయర్, జిల్లా ఉపాధ్యక్షులు చాట్ల స్వామి, జిల్లా సంయోజక్ మేస్రం రాజేష్, జిల్లా కోశాధికారి నాగరాజు, వేణుగోపాల్, సర్వేశ్ రెడ్డి, దుర్వ పరమేశ్వర్, శ్రీనివాస్, రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్ కు బేల మండల సర్పంచుల వినతి

0

 గ్రామాల సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్ కు బేల మండల సర్పంచుల వినతి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: బేల మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ మండల సర్పంచులు శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందజేశారు. యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం తమ గ్రామాల్లో మురరుగు కాలువలు, అంతర్గత రోడ్లు, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్యలపై విచారణ జరిపించి, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాందాస్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆడే శంకర్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మేకల జితేందర్, సదల్ పూర్ సర్పంచ్ మర్సుకోల మంగేష్, చప్రాల సర్పంచ్ దౌలత్ రావు, మసాలా కె సర్పంచ్ జుగత్ రావు, సోన్ కాస్ సర్పంచ్ మెస్రం జనార్ధన్, బాది సర్పంచ్ దంతాల వినోద్, గణేష్ పూర్ సర్పంచ్ నాగారావు, పాటన్ సర్పంచ్ గులాబ్, కొబ్బయి సర్పంచ్ సత్యపాల్, వరూర్ సర్పంచ్ సంతోష్, గూడ సర్పంచ్ అవినాష్, కాప్సి సర్పంచ్ రాహుల్, టాక్లీ సర్పంచ్ రాము, ఉప సర్పంచులు సాగర్, శేఖర్, రాజేందర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు ఘన్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి జూపల్లి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా 

0

 మంత్రి జూపల్లి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా 

చిత్రం న్యూస్ బాసర : నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం బాసరలో పర్యటించి వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో, పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శనివారం బాసరలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, గోదావరి నది పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాల షెడ్యూల్‌కు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం భైంసా తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. నోటీసుల జారీ, తదుపరి ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేసి పూర్తిస్థాయిలో సహకారం అందించాలని సూచించారు.ఈ సందర్భంగా పలువురు ఓటర్లతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి, ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వారి సందేహాలను అడిగి తెలుసుకుని నివృత్తి చేశారు.ఈ కార్యక్రమాల్లో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ ఈఈలు అనిల్, సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, బాసర ఆలయ ఈఓ అంజనా దేవి, తహసీల్దార్లు పవన్ చంద్ర, శశి భూషణ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.