పొనాల ప్రాథమిక పాఠశాలలో ఆట వస్తువుల పంపిణీ చేసిన సామ రూపేష్ రెడ్డి
చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని పొనాల గ్రామ ప్రాథమిక పాఠశాలలో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి విద్యార్థులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. తన సొంత నిధులతో విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచే ఉద్దేశంతో క్రీడా పరికరాలను అందజేయగా, ఉపాధ్యాయులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, చిన్న వయస్సు నుండే క్రీడల వైపు దృష్టి సారించేలా ఈ పంపిణీ చేపట్టామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని, తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మేకల జితేందర్, విజయ్, యువ నాయకుడు మంచికంటి నవనీత్, బీర్షావ్, ప్రధానోపాధ్యాయుడు అశోక్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
