-Advertisement-

జైనథ్‌లో అంగరంగ వైభవంగా పొలాల అమావాస్య వేడుకలు

* వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

*ఉత్తమంగా అలంకరించిన ఎడ్లకు బహుమతులు అందజేసిన ఎస్పీ

  1. చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలో పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలిపారు. రైతులు తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. జైనథ్‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. అనంతరం రైతులు తమ ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించి నిర్వహించిన వేడుకలను వీక్షించారు. రైతులు కలిసికట్టుగా ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవడం అభినందనీయమన్నారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. వ్యవసాయంలో రైతులకు ఎంతో తోడ్పాటునందించే పశువులను గౌరవించడం మన సంప్రదాయంలో భాగమన్నారు. ఎడ్లను అత్యంత ఆకర్షణీయంగా అలంకరించిన రైతులకు గ్రామపంచాయతీ తరఫున ప్రకటించిన బహుమతులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ ఎస్ఐ పి. గౌతమ్, సర్పంచ్ గడ్డం మమత జగదీశ్ రెడ్డి, గ్రామ  పెద్దలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments