బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బేల కాంగ్రెస్ నేతల ఫైర్
చిత్రం న్యూస్, బేల : పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆంధ్రప్రదేశ్-తెలంగాణ విభజనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బేల మండల కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..స్థానిక శివాజీ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఈ వ్యాఖ్యలు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వందలాదిమంది విద్యార్థుల ఆత్మబలి దానాలకు చలించి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలతో త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చిన ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.తేజస్వి సూర్య బేషరతుగా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, కిసాన్ సెల్ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఘన్ శ్యామ్ గవాండే, చంద్రకాంత్ మడావి, ఆత్మ డైరెక్టర్,ఈశ్వర్ ధోటే, సర్పంచులు గంబీర్ థాక్రే, శంకర్ భోక్రె, గులాబ్ గేడాం, అవినాష్ గోడే, బాపురావు దడంజె, సాగర్ థాక్రె నాయకులు సుదర్శన్, కన్నె రాజు, గోపతి శంకర్, యువ నాయకులు హేమంత్ పటేల్, రవి గట్లేవార్, మహబూబ్ ఖాన్, మొబిన్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.

