రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: సీఐ కిరణ్ కుమార్
చిత్రం న్యూస్, బాసర : ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సీఐ కిరణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాసర గ్రామ పంచాయతీలో రోడ్డు భద్రత పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేటపుడు హెల్మెట్ ధరించాలన్నారు. మన కోసం ఇంట్లో భార్యా, పిల్లలు ఎదురుచూస్తుంటారని, వాహనం జాగ్రతగా నడుపుతూ గమ్యం చేరుకోవాలని సూచించారు. మైనర్ లకు వాహనాలు ఇవ్వద్దని, మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, మట్కా, అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని వాటికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. ఉప సర్పంచ్ సయ్యద్ అలీ, ఈవో ప్రసాద్ గౌడ్, కాంప్లెక్స్ హెచ్ ఎం నర్సయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్ దేశాయ్, ఆత్మ డైరెక్టర్ జలిల్, వార్డు మెంబర్ లు కృష్ణ, ఫసియొద్దిన్, ఫారుఖ్, నానం సాయిలు, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

