Home Blog Page 4

కాంగ్రెస్ 1000 రోజుల ప్రజా పాలన సందర్బంగా బైక్ ర్యాలీ

0

 కాంగ్రెస్ 1000 రోజుల ప్రజా పాలన సందర్బంగా బైక్ ర్యాలీ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనకు 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ కుమురం భీం చౌక్, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, డీటీసీ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, నెహ్రూ రోడ్డు, నేతాజీ చౌక్, గర్ల్స్ హైస్కూల్ మీదుగా తిరిగి డీసీసీ కార్యాలయానికి చేరుకుంది. దారి పొడవునా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌక్ లో ఏర్పాటు చేసిన సభలో నాయకులు మాట్లాడారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ… గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

*కేసీఆర్ రాజీనామా చేసి ప్రజా తీర్పు ఎదుర్కోవాలి – కాంగ్రెస్ నేతల డిమాండ్

పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ తన హయాంలో రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి అంశాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు సమాధానం చెప్పాలని, రాజకీయ బాధ్యత తీసుకుని రాజీనామా చేసి ప్రజా తీర్పును ఎదుర్కోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు మాని, నిరుద్యోగం, రైతు సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి వంటి ప్రజా సమస్యలపై చర్చ జరగాలని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరల పెరుగుదల, నిరుద్యోగంపై దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, బోథ్ ఇంచార్జ్ ఆడే గజేందర్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవరెడ్డి, ఐఎన్టీయూసీ నాయకుడు మునిగేల నర్సింగ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు చరణ్ గౌడ్, మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, ఎస్సీ సెల్ చైర్మన్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంటావార్పు

0

కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంటావార్పు

చిత్రం న్యూస్, జైనథ్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం  పోరుబాట కార్యక్రమం చేపట్టారు. జైనథ్ మండలం ఖాప్రి ఎక్స్ రోడ్డు జాతీయ రహదారిపై వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై మాజీ మంత్రి జోగు రామన్న భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సాంప్రదాయ, సాంస్కృతిక భజన కార్యక్రమాలను రోడ్లపై ప్రదర్శించగా మాజీ మంత్రి జోగు రామన్న వారితో కలిసి ఉత్సహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ..  ప్రజా సంక్షేమానికి గత brs ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కనికరం లేకుండా ప్రతి ఇంటిని సంక్షోభానికి గురి చేసిందన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు అండగా ఉన్న పథకాలను సైతం నీర్వేర్యం చేసే కుట్రలు పన్నడం సరికాదన్నారు. గత ప్రభుత్వంపై ఉన్న అక్కసును తెలంగాణ ప్రజలపై రుద్దడం సమంజసం కాదని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో విద్యార్థులు, మహిళలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మితోపాటు విద్యార్థిని విద్యార్థుల ఉన్నత విద్యా విధానాన్ని పెంపొందిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కడుపులో పుట్టిన బిడ్డనుండి వృద్ధుల వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు..కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు ఇలా 420 దొంగ హామీలు ఇచ్చి అధికారం రాగానే రేవంత్ రెడ్డికి ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తు రావడంలేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినా, ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, హామీల అమలు కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో యాసం నర్సింగ్ రావు, కళ్లెం ప్రమోద్ రెడ్డి, సతీష్ పవార్, గోవర్ధన్, గంభీర్ టాక్రీ,గణేష్ యాదవ్, జక్కుల మధుకర్, కిషన్ వైద్య, తన్విర్, దేవన్న, వెంకన్న, రవి కాంత్ రెడ్డి, పురుషోత్తం, కోరెడ్డి నర్సింగ్, నితిన్ రెడ్డి, అడప తిరుపతి, ఊశన్న,తదితరులు పాల్గొన్నారు.

బాసర అమ్మవారికి తెలుగు అక్షరమాలతో చేనేత పట్టుచీర

0

బాసర అమ్మవారికి తెలుగు అక్షరమాలతో చేనేత పట్టుచీర

చిత్రం న్యూస్ బాసర : నిర్మల్ జిల్లా సిరిసిల్లకు చెందిన నల్ల పరంధాములు కుమారుడు నల్ల జగదీష్ నేసిన చేనేత తెలుగు అక్షరమాల పట్టుచీరను మేళ తాళాల మధ్య శుక్రవారం బాసర సరస్వతి అమ్మవారికి ఆలయ ఈవో అంజనాదేవి వేద పండితుల సమక్షంలో సమర్పించారు.నల్ల జగదీష్ నేత చేనేత మగ్గముపై తెలుగు అక్షరమాలను పట్టుచీరపై నేయడానికి సంకల్పించుకొన్నారు. 15 రోజుల్లో ఆరు మీటర్ల 30 సెంటీమీటర్ల వస్త్రము 650 గ్రాములతో  నేశారు. సున్నిహితమైన పనితనముతో ఈ వస్త్రాన్ని తయారుచేసి పద్మశాలీల వృత్తి నైపుణ్యాన్ని తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాలలో ఖ్యాతిని పెంపొందించేలా చేశారు. చేనేత పరిశ్రమ.. మిల్లు వస్త్రములతో పోటీ పడలేక కునారిలుతుందని తెలిసిందే.. చేనేత ఎప్పటికప్పుడు వృత్తి కళాకారుల నైపుణ్యముతో ప్రజల మనసులకు దగ్గరయ్యే వస్త్రాలను తయారు చేస్తూ మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కార్యక్రమంలో సత్ర అధ్యక్షులు శ్రీ రాపోల్ సుధాకర్, కార్యనిర్వహక అధ్యక్షులు, గుజ్జ రాజేశ్వరి,ప్రధాన కార్యదర్శిలు రమణ విశ్వం, శ్యామ్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్,కొక్కుల గంగాధర్, మోరే సాయిలు, ఎలగందుల శ్రీనివాస్ ఓని స్వామి ,రువ్విపోశెట్టి, మేకల అశోక్ ,అంకం రమేష్ గ్రామ పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలపై బాసరలో  బీఆర్ఎస్ నిరసన

0

కాంగ్రెస్ వైఫల్యాలపై బాసరలో  బీఆర్ఎస్ నిరసన

*ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేదని భారీ బహిరంగ ర్యాలీ 

​చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపిస్తూ బాసర పుణ్యక్షేత్రంలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలు అమలుకాకుండా ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆందోళనకారులు మండిపడ్డారు. ఈ ర్యాలీలో సమన్వయకర్త కిరణ్ కొమ్రేవార్, శ్యాంసుందర్ , గద్దేకర్ విలాస్, బాసర మండల అధ్యక్షుడు శ్యామ్ ,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

ప్రధాన డిమాండ్లు మరియు విమర్శలు

అమలుకాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో ఎక్కువ భాగం అమలుకు నోచుకోలేదని, ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు. రైతులు, నిరుద్యోగుల మోసం, రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత పథకాల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాకీ కార్డుల పంపిణీ అమలు కాకుండా మిగిలిపోయిన హామీలను వివరిస్తూ ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు. ​ఉద్యమం ఇక్కడితో ఆగదని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్క హామీని నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కప్ గంగాధర్, రవి మంతెన పోశెట్టి ,జాజోళ్ల రాజు, జాజోళ్ల అశోక్, శివన్న తదితరులు పాల్గొన్నారు.

బాసరలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు 

0

* భక్తులతో కిక్కిరిసిన శ్రీకృష్ణ ఆలయం

చిత్రం, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని గోపాలకృష్ణ స్వామి వారికి ఆలయ అర్చకులు భూమన్న యాదవ్ పాలు, పెరుగు, వెన్న, తేనె వంటి పంచామృతాలతో అభిషేకాలు జరిపి ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు.శ్రీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రేపు శ్రీకృష్ణుని పల్లకి సేవ, చిన్నారులకు శ్రీకృష్ణుడి, రాధమ్మల వేషధారణ, ఉట్టి కొట్టడం పోటీలను ఏర్పాటు చేసి వారికి స్వామి వారి ప్రతిమలను అందజేయనున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం:మాజీ మంత్రి జోగు రామన్న

0

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం:మాజీ మంత్రి జోగు రామన్న

*భోరజ్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట

*భారీగా తరలివచ్చిన రైతులు

చిత్రం న్యూస్, భోరజ్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా భోరజ్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న హాజరై రైతులతో మాట్లాడారు. గత పదేళ్లలో రైతులు ఎదుర్కోని అనేక సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతులు యూరియా, విత్తనాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం పోలీసు పహారా మధ్య వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు సుమారు 33 నెలలు పూర్తయినా ప్రజల సమస్యలు, ముఖ్యంగా రైతుల సమస్యలు మరింత పెరిగాయని విమర్శించారు. ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉందని జోగు రామన్న ఆరోపించారు. ఉపాధి హామీ పథకం విషయంలోనూ వ్యవసాయ కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని జోగు రామన్న పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, వ్యవసాయ పనిముట్లతో పాటు పంటలకు ప్రోత్సాహకాలు అందిస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని ఆయన విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రైతులకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, రైతులకు రావాల్సిన ప్రతి రూపాయి అందే వరకు పోరాడాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. రైతు సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రైతు సదస్సుల ద్వారా బీఆర్‌ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. మాజీ ఎంపీపీ మార్చెట్టి గోవర్ధన్, మాజీ వైస్ ఎంపీపీ విజయకుమార్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మద్దుల ఊశన్న, అయ్యా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోండి: బాసర ఎంపీడీవోకు వినతి పత్రంఅందజేత 

0

పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోండి: బాసర ఎంపీడీవోకు వినతి పత్రంఅందజేత

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని దొడాపూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శి మమతపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామ సర్పంచ్ సతీష్ తో పాటు ఉపసర్పంచ్ విజయ్ వార్డు సభ్యులు, గ్రామస్తులు బాసర ఎంపీడీవో దేవేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్న ప్రకారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి విధులపై అసమర్ధత చూపుతూ సమయానికి రాకుండా వచ్చిన సమయానికి ముందే ఇంటికి వెళ్లిపోవడం సర్పంచ్ తో పాటు పలువురులను గౌరవించకపోవడం విధి నిర్వహణలో భాగంగా గ్రామస్తులకు దురుసుగా మాట్లాడడం. తమ యొక్క పరివర్తనను మార్చుకోవాలని గ్రామస్తులు చెప్పిన పట్టించుకోకపోవడం, గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించగా నేను ఇక్కడ విధులు నిర్వహించను అంటూ సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో..వేరే పంచాయతీ కార్యదర్శి నియమించండి అంటూ గ్రామస్తులు బాసర మండల ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు.

హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బెండ లచ్చన్నకు సన్మానం 

0

హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బెండ లచ్చన్నకు సన్మానం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బెండ లచ్చన్నను గురువారం ఘనంగా సన్మానించారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడంతో కురుమ సంఘం జైనథ్ మండల అధ్యక్షుడు అరిగెల శ్రీనివాస్ ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.  శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

 

బీఆర్ఎస్ ధర్నాలు సిగ్గుచేటు: వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ శివానంద రెడ్డి

0

బీఆర్ఎస్ ధర్నాలు సిగ్గుచేటు: వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నేత బండ శివానంద రెడ్డి

చిత్రం న్యూస్,జమ్మికుంట: పదేళ్లు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రజాపాలన పై ధర్నాలు చేయడం సిగ్గుచేటని వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ శివానంద రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. ప్రజా పాలన చూసి ఓర్వ లేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. మూడేళ్ల పాలనలో ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తుందని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేదవారికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో దళిత సీఎం, డబుల్ బెడ్రూం, 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ, నిరుద్యోగ భృతి, హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

కీర్గుల్ (కె) ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

0

కీర్గుల్ (కె) ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం  ​కీర్గుల్ (కె)గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. పిల్లల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, రవళిక, భవాని, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.