Home Blog Page 5

బాసర అమ్మవారికి తెలుగు అక్షరమాలతో చేనేత పట్టుచీర

0

బాసర అమ్మవారికి తెలుగు అక్షరమాలతో చేనేత పట్టుచీర

చిత్రం న్యూస్ బాసర : నిర్మల్ జిల్లా సిరిసిల్లకు చెందిన నల్ల పరంధాములు కుమారుడు నల్ల జగదీష్ నేసిన చేనేత తెలుగు అక్షరమాల పట్టుచీరను మేళ తాళాల మధ్య శుక్రవారం బాసర సరస్వతి అమ్మవారికి ఆలయ ఈవో అంజనాదేవి వేద పండితుల సమక్షంలో సమర్పించారు.నల్ల జగదీష్ నేత చేనేత మగ్గముపై తెలుగు అక్షరమాలను పట్టుచీరపై నేయడానికి సంకల్పించుకొన్నారు. 15 రోజుల్లో ఆరు మీటర్ల 30 సెంటీమీటర్ల వస్త్రము 650 గ్రాములతో  నేశారు. సున్నిహితమైన పనితనముతో ఈ వస్త్రాన్ని తయారుచేసి పద్మశాలీల వృత్తి నైపుణ్యాన్ని తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాలలో ఖ్యాతిని పెంపొందించేలా చేశారు. చేనేత పరిశ్రమ.. మిల్లు వస్త్రములతో పోటీ పడలేక కునారిలుతుందని తెలిసిందే.. చేనేత ఎప్పటికప్పుడు వృత్తి కళాకారుల నైపుణ్యముతో ప్రజల మనసులకు దగ్గరయ్యే వస్త్రాలను తయారు చేస్తూ మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కార్యక్రమంలో సత్ర అధ్యక్షులు శ్రీ రాపోల్ సుధాకర్, కార్యనిర్వహక అధ్యక్షులు, గుజ్జ రాజేశ్వరి,ప్రధాన కార్యదర్శిలు రమణ విశ్వం, శ్యామ్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్,కొక్కుల గంగాధర్, మోరే సాయిలు, ఎలగందుల శ్రీనివాస్ ఓని స్వామి ,రువ్విపోశెట్టి, మేకల అశోక్ ,అంకం రమేష్ గ్రామ పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలపై బాసరలో  బీఆర్ఎస్ నిరసన

0

కాంగ్రెస్ వైఫల్యాలపై బాసరలో  బీఆర్ఎస్ నిరసన

*ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేదని భారీ బహిరంగ ర్యాలీ 

​చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపిస్తూ బాసర పుణ్యక్షేత్రంలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలు అమలుకాకుండా ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆందోళనకారులు మండిపడ్డారు. ఈ ర్యాలీలో సమన్వయకర్త కిరణ్ కొమ్రేవార్, శ్యాంసుందర్ , గద్దేకర్ విలాస్, బాసర మండల అధ్యక్షుడు శ్యామ్ ,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

ప్రధాన డిమాండ్లు మరియు విమర్శలు

అమలుకాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో ఎక్కువ భాగం అమలుకు నోచుకోలేదని, ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు. రైతులు, నిరుద్యోగుల మోసం, రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత పథకాల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాకీ కార్డుల పంపిణీ అమలు కాకుండా మిగిలిపోయిన హామీలను వివరిస్తూ ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు. ​ఉద్యమం ఇక్కడితో ఆగదని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్క హామీని నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కప్ గంగాధర్, రవి మంతెన పోశెట్టి ,జాజోళ్ల రాజు, జాజోళ్ల అశోక్, శివన్న తదితరులు పాల్గొన్నారు.

బాసరలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు 

0

* భక్తులతో కిక్కిరిసిన శ్రీకృష్ణ ఆలయం

చిత్రం, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని గోపాలకృష్ణ స్వామి వారికి ఆలయ అర్చకులు భూమన్న యాదవ్ పాలు, పెరుగు, వెన్న, తేనె వంటి పంచామృతాలతో అభిషేకాలు జరిపి ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు.శ్రీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రేపు శ్రీకృష్ణుని పల్లకి సేవ, చిన్నారులకు శ్రీకృష్ణుడి, రాధమ్మల వేషధారణ, ఉట్టి కొట్టడం పోటీలను ఏర్పాటు చేసి వారికి స్వామి వారి ప్రతిమలను అందజేయనున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం:మాజీ మంత్రి జోగు రామన్న

0

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం:మాజీ మంత్రి జోగు రామన్న

*భోరజ్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట

*భారీగా తరలివచ్చిన రైతులు

చిత్రం న్యూస్, భోరజ్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా భోరజ్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న హాజరై రైతులతో మాట్లాడారు. గత పదేళ్లలో రైతులు ఎదుర్కోని అనేక సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతులు యూరియా, విత్తనాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం పోలీసు పహారా మధ్య వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు సుమారు 33 నెలలు పూర్తయినా ప్రజల సమస్యలు, ముఖ్యంగా రైతుల సమస్యలు మరింత పెరిగాయని విమర్శించారు. ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉందని జోగు రామన్న ఆరోపించారు. ఉపాధి హామీ పథకం విషయంలోనూ వ్యవసాయ కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని జోగు రామన్న పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, వ్యవసాయ పనిముట్లతో పాటు పంటలకు ప్రోత్సాహకాలు అందిస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని ఆయన విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రైతులకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, రైతులకు రావాల్సిన ప్రతి రూపాయి అందే వరకు పోరాడాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. రైతు సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రైతు సదస్సుల ద్వారా బీఆర్‌ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. మాజీ ఎంపీపీ మార్చెట్టి గోవర్ధన్, మాజీ వైస్ ఎంపీపీ విజయకుమార్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మద్దుల ఊశన్న, అయ్యా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోండి: బాసర ఎంపీడీవోకు వినతి పత్రంఅందజేత 

0

పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోండి: బాసర ఎంపీడీవోకు వినతి పత్రంఅందజేత

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని దొడాపూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శి మమతపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామ సర్పంచ్ సతీష్ తో పాటు ఉపసర్పంచ్ విజయ్ వార్డు సభ్యులు, గ్రామస్తులు బాసర ఎంపీడీవో దేవేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్న ప్రకారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి విధులపై అసమర్ధత చూపుతూ సమయానికి రాకుండా వచ్చిన సమయానికి ముందే ఇంటికి వెళ్లిపోవడం సర్పంచ్ తో పాటు పలువురులను గౌరవించకపోవడం విధి నిర్వహణలో భాగంగా గ్రామస్తులకు దురుసుగా మాట్లాడడం. తమ యొక్క పరివర్తనను మార్చుకోవాలని గ్రామస్తులు చెప్పిన పట్టించుకోకపోవడం, గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించగా నేను ఇక్కడ విధులు నిర్వహించను అంటూ సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో..వేరే పంచాయతీ కార్యదర్శి నియమించండి అంటూ గ్రామస్తులు బాసర మండల ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు.

హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బెండ లచ్చన్నకు సన్మానం 

0

హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బెండ లచ్చన్నకు సన్మానం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బెండ లచ్చన్నను గురువారం ఘనంగా సన్మానించారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడంతో కురుమ సంఘం జైనథ్ మండల అధ్యక్షుడు అరిగెల శ్రీనివాస్ ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.  శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

 

బీఆర్ఎస్ ధర్నాలు సిగ్గుచేటు: వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ శివానంద రెడ్డి

0

బీఆర్ఎస్ ధర్నాలు సిగ్గుచేటు: వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నేత బండ శివానంద రెడ్డి

చిత్రం న్యూస్,జమ్మికుంట: పదేళ్లు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రజాపాలన పై ధర్నాలు చేయడం సిగ్గుచేటని వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ శివానంద రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. ప్రజా పాలన చూసి ఓర్వ లేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. మూడేళ్ల పాలనలో ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తుందని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేదవారికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో దళిత సీఎం, డబుల్ బెడ్రూం, 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ, నిరుద్యోగ భృతి, హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

కీర్గుల్ (కె) ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

0

కీర్గుల్ (కె) ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం  ​కీర్గుల్ (కె)గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. పిల్లల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, రవళిక, భవాని, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం  

0

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం  

చిత్రం న్యూస్, బాసరజనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా బాసర మండలంలోని జనసేన యువకులు, అభిమానులు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మారుతి పటేల్ రాజు మాట్లాడుతూ.. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు పేదలకు వస్త్రాలు,అవసరమైన సామగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు: రిమ్స్ ఆసుపత్రిలో ‘నేస్తం ఫౌండేషన్’ అన్నదానం

0

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు: రిమ్స్ ఆసుపత్రిలో ‘నేస్తం ఫౌండేషన్’ అన్నదానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో పేదలకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేస్తం ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్, వంశీ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయకులకు, నిరుపేదలకు భోజనాలు వడ్డించి వారి ఆకలి తీర్చారు. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో, సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేస్తం ఫౌండేషన్ సామాజిక సేవలను అభినందించారు.

.