ఇంటినుండి వెళ్ళిపోయిన యువకున్ని కాపాడిన బాసర పోలీసులు
*అభినందించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలో అనుమానస్పదంగా తిరుగుతున్న యువకుడిని గోదావరి నది వద్ద గమనించి స్థానికులు 100కు డయల్ చేశారు. ఈ సమాచారం అందుకొని పోలీసులు హుటాహుటిన గోదావరి నది వద్ద చేరుకొని అతన్ని పట్టుకున్నారు. బాసర పోలీస్ స్టేషన్ తరలించి అతని వివారాలు ఆరా తీశారు. కుంటాల మండలం లింబ కే గ్రామానికి చెందిన పండ్ల సిందే విజయ్ కుమార్ గా గుర్తించారు. కుటుంబం కలహాల కారణంగా చిన్న గొడవతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకొని గోదావరి వద్దకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆయన్ను అప్పగించారు. ఈ సమాచారంపై స్పందించిన సీఐ కిరణ్ కుమార్, బాసర పోలీసులు గగన్, సుభాష్, చందు, భాస్కర్ ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు .

