విద్యార్థికి బ్యాగును అందజేస్తున్న ముడుపు మౌనిష్ రెడ్డి
చిత్రం న్యూస్, బేల: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో భాగంగా తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్కులు, బ్యాగులు, అందిస్తున్నానని తెలిపారు. శనివారం బేల మండలం కొబ్బాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, పెన్నులను, బ్యాగులను అందజేశారు. అంతకు ముందు గ్రామస్తులు మౌనిష్ రెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా చదివి గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నగేష్, ఉపాధ్యాయులు సుభాష్, లీనా, దీప, గ్రామస్తులు నానాజీ పటేల్, దేవరావు గేడం,దుర్యోదన్, జయేంద్ర, త్రియాంబక్, సీతారాం, మనోజ్, సందీప్ టాక్రె, సచిన్ తదితరులు ఉన్నారు.

