జైనథ్ తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, జైనథ్: జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. జైనథ్ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆత్రం నారాయణ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటాలు, ఆయన బోధించిన సత్యం, అహింసా మార్గాలు ఎప్పటికీ ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజ సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ హన్మంత్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) రాందాస్, జీపీఓలు దేవన్న, సురేష్, నందు, కంప్యూటర్ ఆపరేటర్లు రవి, రవితేజ, రాఘవ, రాకేష్లతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొని బాపూజీకి నివాళులు అర్పించారు.
