-Advertisement-

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో కీలకం..డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో కీలకం..డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్

చిత్రంన్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఎరీనా విఎన్ఆర్ మైదానంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న అండర్ 14 దసరా కప్ క్రికెట్ పోటీలో భాగంగా గురువారం ఫైనల్ మ్యాచ్ వి ఎన్ ఆర్ అకాడమీ,ఎంసీఏ అకాడమీ మహారాష్ట్ర మధ్య జరిగిన  మ్యాచ్ లో ఆతిథ్య విఎన్ఆర్ జట్టు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన  ఎంసీఏ జట్టు నిర్ణీత ఓవర్లలో 102 పరుగులు చేయగా ఆతిథ్య జట్టు 18 ఓవర్లలోనే 103 పరుగులు చేసి విజయం సాధించించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి .హుస్సేన్ హాజరై మాట్లాడారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని,చదువు ద్వారా జ్ఞానం,విజ్ఞానం పెంపొందించుకుంటే, క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ అలవడతాయని వారు పేర్కొన్నారు.క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో జట్టుగా పనిచేసే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం పెంపొందుతాయి. క్రీడలు ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంచడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని అందిస్తాయని,విజేతలకు,నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్,అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే,నిర్వాహకులు నరోత్తం రెడ్డి,వివిధ జట్ల కోచ్ లు పాల్గొన్నారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments