-Advertisement-

విద్యతో పాటు మంచి వ్యక్తిత్వం.. విద్యార్థికి బలమైన పునాది 

విద్యతో పాటు మంచి వ్యక్తిత్వం.. విద్యార్థికి బలమైన పునాది 

అవగాహన సదస్సులో  వ్యక్తిత్వ వికాస నిపుణుడు మెస్రం నాగేశ్వర్ రావు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: విద్యతో పాటు మంచి వ్యక్తిత్వం విద్యార్థికి బలమైన పునాది అని వ్యక్తిత్వ వికాస నిపుణుడు మెస్రం నాగేశ్వర్ రావు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ కోలాం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో IMPACT FOUNDATION ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు అవగాహన సదస్సును  శుక్రవారం నిర్వహించారు. ఫౌండేషన్ కు సంబంధించిన వ్యక్తిత్వ వికాస నిపుణులు మెస్రం నాగేశ్వర్ రావు, జి. వినోద్ కుమార్, జే.అమిత్ నాయక్ ఇతర సభ్యులు పాల్గొని మాట్లాడారు.  విద్యార్థులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనా విధానం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. గాంధీ మార్గంలో నడవాలని, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలన్నారు. మంచి వ్యక్తిత్వంతో పాటుగా ఉన్నత చదువులు చదివి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. అంతకుముందు గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను  నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments