దుర్గా శత చండీ యాగం: పాల్గొన్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్
చిత్రం న్యూస్, తాంసి: మండల కేంద్రం సమీపంలో గల భవానీ గిరిపై వెలిసిన దుర్గా మాత ఆలయంలో దుర్గా శత చండీ యాగం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించగా ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.హుస్సేన్ పాల్గొన్నారు. యాగంలో భాగంగా వేద పండితులు ప్రత్యేక పూజలు, చండీ పారాయణం, హోమాది క్రతువులను నిర్వహించారు. దుర్గాదేవి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, సమాజంలో సుఖశాంతులు, సౌభాగ్యం, ఐకమత్యం వెల్లివిరియాలని ఈ సందర్భంగా పూజలు చేశారు. యాగ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే, నిర్వాహకులు శివ దీక్ష తత్పరులు శివానంద గిరి మహరాజ్, రత్నప్రకాష్, స్థానిక సర్పంచ్ సంతోష్ రెడ్డి, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి యాగంలో పాల్గొనడంతో కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

