లక్ష్మీపూర్ డ్యామ్‌ను పరిశీలించిన ఎస్డీఎస్ఓ నిపుణుల బృందం
చిత్రం న్యూస్, జైనథ్: రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డిఎస్ఓ) ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ (పీఓఈ) బృందం గురువారం లక్ష్మీపూర్ డ్యామ్‌ను క్షేత్రస్థాయిలో సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించింది.పీఓఈ చైర్మన్ శ్రీ అశోక్ కుమార్ గంజు నేతృత్వంలోని ఈ ఉన్నత స్థాయి కమిటీలో స్ట్రక్చరల్ ఎక్స్పర్ట్, రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ టి. రాజశేఖర్, మెకానికల్ ఎక్స్పర్ట్, రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ ఎన్. సంజీవ్ సభ్యులుగా పాల్గొన్నారు. డ్యామ్ భద్రత, నిర్వహణ ప్రమాణాలను అంచనా వేయడానికి ఈ తనిఖీలు చేపట్టారు.ఈ పరిశీలనలో భాగంగా నిపుణుల బృందం లక్ష్మీపూర్ డ్యామ్ యొక్క నిర్మాణ భద్రత, ఇంజనీరింగ్ డిజైన్, అలాగే గేట్లు, ఇతర మెకానికల్ విభాగాల పనితీరును అత్యంత వివరంగా సమీక్షించింది. డ్యామ్ పటిష్టతకు సంబంధించిన కీలక అంశాలపై స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ (సీఈ) జగదీష్, సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) ప్రభుకల్యాణ్, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావుతో పాటు పలువురు నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొని, డ్యామ్ నిర్వహణ తీరును నిపుణుల కమిటీకి వివరించారు. ఈ కార్యక్రమంలో జైనథ్, కాప్రి, మాకోడ, బెల్గాం, బెల్లూరి తదితరులు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
