-Advertisement-

వైభవంగా అబ్దుల్లాపూర్ మోక్ష గణపతి నిమజ్జనోత్సవం

వైభవంగా అబ్దుల్లాపూర్ మోక్ష గణపతి నిమజ్జనోత్సవం

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో నవరాత్రుల పాటు పూజలందుకున్న మోక్ష గణపతి నిమజ్జనోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు విశేష అలంకారాలు, ధూపదీప నైవేద్యాలతో భక్తుల పూజలందుకున్న గణనాథుడు, గురువారం శోభా యాత్రగా నిమజ్జన ఘట్టానికి బయలుదేరారు.

​గోవింద నామస్మరణలు, శోభాయాత్ర..

బాణసంచా కాల్పులు, భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ మోక్ష గణపతి శోభాయాత్ర వేడుకగా సాగింది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ యాత్రలో మహిళలు, పెద్దలు, పిల్లలు వేలాదిగా పాల్గొన్నారు. గణపతికి నీరాజనాలు అర్పిస్తూ సమర్పించిన భక్తి ప్రవత్తులతో అబ్దుల్లాపూర్ వీధులన్నీ శోభాయమానంగా మారాయి. “గణపయ్య మళ్లీ  రావయ్యా” అంటూ వీడ్కోలు పలికారు. గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శోభాయాత్రను, నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని జలాశయానికి తరలించి శాస్త్రోక్తంగా నిమజ్జనం పూర్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments