-Advertisement-

విద్యతో పాటు సేవాభావం అలవర్చుకోవాలి: సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి

విద్యతో పాటు సేవాభావం అలవర్చుకోవాలి: సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రతి విద్యార్థి విద్యతో పాటు సేవా భావాన్ని కూడా అలవర్చుకోవాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం NSS Day (జాతీయ సేవా పథకం) సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితులలో సేవలందించే విధంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సేవా మిత్ర సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ రఘు గణపతి, అమన్ ఫౌండేషన్ అర్ఫాత్ ఖాన్, NSS యూనిట్ 1 ప్రోగ్రాం ఆఫీసర్ యాకుబ్ అలీ, యూనిట్ 2 ప్రోగ్రాం ఆఫీసర్ పృథ్వీ రాజ్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments