-Advertisement-

బేల మండలంలో పిడుగుపాటుకు మహిళ మృతి

బేల మండలంలో పిడుగుపాటుకు మహిళ మృతి

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఆవాల్పూర్ గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంలో  పిడుగుపాటుతో ఓ మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ మధు కృష్ణ, గ్రామస్తులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సోడేo సురేష్ భార్య లత (4o) తన వ్యవసాయ పొలంలో పత్తి పంటలో కలుపు తీసేందుకు వెళ్ళింది. మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కలుపు తీస్తున్న ఆమెపై ఒక్కసారిగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కొంతసేపటి తర్వాత పొలానికి వెళ్లిన ఆమె కుమారుడు అంజి కుమార్ తల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  అవాల్పూర్ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమెకు భర్తతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments