-Advertisement-

ప్రధానోపాధ్యాయురాలు సాధన సేవలు చిరస్మరణీయం: చిట్యాల సుహాసిని రెడ్డి 

ప్రధానోపాధ్యాయురాలు సాధన సేవలు చిరస్మరణీయం: చిట్యాల సుహాసిని రెడ్డి 

చిత్రం న్యూస్,అదిలాబాద్ :విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రధానోపాధ్యాయురాలిగా ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన సాధన సేవలు ఎనలేనివని బిజేపీ నాయకురాలు, మాజీ జడ్పీ చైర్మన్ చిట్యాల సుహాసిని రెడ్డి కొనియాడారు. గత నెలలో పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయురాలు సాధన గౌరవార్థం ఆదివారం స్థానికంగా ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిట్యాల సుహాసిని రెడ్డి సాధనని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా చిట్యాల సుహాసిని రెడ్డి ప్రసంగిస్తూ.. దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు విద్యా వృత్తిలో కొనసాగుతూ, వివిధ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థులలో క్రమశిక్షణ, నైతిక విలువులను పెంపొందించడానికి అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. పదవీ విరమణ అనేది కేవలం విధి నిర్వహణకు మాత్రమేనని, సమాజానికి ఆమె అందించే మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. సాధన శేష జీవితాన్ని ఆరోగ్యంగా, ప్రశాంతంగా గడపాలని ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రముఖులు సాధన కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments