చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్
చిత్రం న్యూస్, జైనథ్: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ అన్నారు. జైనథ్ మండలం నిరాల గ్రామంలో పేదరిక నిర్మూలనపై బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు సోషల్ మీడియా, విద్యా హక్కు, ఉచిత న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్, చైల్డ్ మ్యారేజ్, రైతులకు నకిలీ విత్తనాలు ,మందులపై వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, చంద్రకాంత్ చౌదరి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే, సర్పంచ్ సునంద ప్రభాకర్,పంచాయతీ కార్యదర్శి రేఖ, గ్రామస్తులు,రైతులు పాల్గొన్నారు.
