*డిమాండ్ల సాధన కోసం భోజన విరామ సమయంలో ఉద్యోగుల నిరసన
*ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ రెండు లోగా పీఆర్ సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యోగులు భోజన విరామ సమయంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన… నిజామాబాద్ కలెక్టరేట్ సమీకృత కార్యాలయ ఆవరణలో, నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్ పులగం దామోదర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ అనంతరం 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగుల సమస్యలపై ఉద్యమించుటకు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరీ శ్రీనివాస్ రావు అధ్యక్షతన, 206 పైగా భాగస్వామ్య సంఘాలతో టీజీ ఈ జేఏసీ ని స్థాపించి, పలుమార్లు 69 పైగా డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసినప్పటికీని, ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల సమస్యలను పెడచెవిన పెట్టడం వల్ల, ఉద్యమ కార్యచరణను ప్రకటించిన నేపథ్యంలో…ఇదివరకే ప్రభుత్వానికి నివేదించిన 69 డిమాండ్ లో అతి ముఖ్యమైన నాలుగు డిమాండ్లలో మొదటిది, పీ ఆర్ సీ కమిటీ వేసి 30 నెలల గడుస్తున్నప్పటికిని నేటికి నివేదిక తెప్పించుకోకపోవడం విడ్డూరమని అయన అన్నారు. అతి త్వరగా 51% శాతం ఫిట్మెంట్ తో, 2 వ పిఆర్సిని, అమలు చేయాలనిరెండవది ఉద్యోగులకు 13 వేల కోట్లకు పైగా బకాయి పడ్డ పెండింగ్ బిల్లుల అన్నింటిని ఏక మొత్తంగా విడుదల చేయాలని మూడవది అతి ముఖ్యమైనది ఉద్యోగులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేస్తూ, ఆరోగ్య కార్డులను అమలు చేయాలని
మూడవది రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి మరచినట్టు కాదని, సెప్టెంబర్ 2004 తర్వాత నియమించబడిన ఉద్యోగులందరికీ సి పి ఎస్ స్కీం నుండి రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు మిగతా 64 డిమాండ్లను కూడా పరిష్కరించాలని, నిరసన ప్రదర్శనను చేపట్టామని… ఉద్యమ కార్యచరణలో భాగంగా, మే 5 న సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తామని తెలుపుతూ, అయినను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే, రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ… ఉద్యమ కార్యచరణలో భాగంగా, నిరసన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర బాధ్యులు పులగం దామోదర్ రెడ్డి కి, టీజీఈ జేఏసీ జిల్లా భాగస్వామ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, అన్ని శాఖల ఉద్యోగులకు మహిళా ఉద్యోగ సోదరులందరికీ ఉద్యమాభివంధనాలు తెలియజేస్తూ. టి జి ఈ జేఏసీ రాష్ట్ర బాధ్యులు దామోదర్ రెడ్డి తెలిపినట్టు పైన తెలిపిన నాలుగు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనియెడల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యమ కార్యచరణను నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నామని, దీనికి గాను ఉద్యోగులందరూ సమయత్తం కావాలని సూచించారు. ఈ నిరసన కార్యక్రమానికి వీరితోపాటు టీజీఈ జేఏసీ జిల్లా, కో చైర్మన్లు రమేష్, రమన్ రెడ్డి, ధర్మేందర్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సురేష్, పండరినాథ్, వైస్ చైర్మన్లు విజయ్ సింగ్, శేఖర్ ,అమృత్ కుమార్, ప్రశాంత్,మోహన్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, టీజీఈ జేఏసీ జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

