Home Blog Page 29

ఓని గ్రామంలో మారెమ్మ, మైసమ్మ నూతన విగ్రహాల ప్రతిష్టాపన

0

ఓని గ్రామంలో మారెమ్మ, మైసమ్మ నూతన విగ్రహాల ప్రతిష్టాపన

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఓని గ్రామంలో మంగళవారం మారెమ్మ, మైసమ్మ, నూతన విగ్రహాలను ప్రతిష్టించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో గత కొన్ని దశాబ్దాల కాలం నుండి పాత విగ్రహాలకి పూజలు నిర్వహిస్తున్న భక్తులు ఈ సంవత్సరం గ్రామస్తులంతా కలిసి అందరి నిర్ణయంతో నూతన విగ్రహాలకు ప్రతిష్టాపన చేశారు. నర్సింగ్ రావు మహారాజ్ మంగళవారం ఉదయం మహా చండీ హోమం చేపట్టారు. అనంతరం   మహిళలు మహా మంగళహారతులు పట్టుకొని భాజా భజంత్రీల మధ్య శోభాయాత్ర చేపట్టి పోచమ్మ మహాలక్ష్మి వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమం స్వీకరించారు.మారెమ్మ మైసమ్మ ను మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు పాడి పంటలతో, సుఖశాంతులతో  కలిగి ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.

ఘనంగా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభం

ఘనంగా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభం

*అమరులైన అగ్నివీరులకు నివాళులు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో :జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబై నగరంలోని విక్టోరియా డాక్ యార్డ్ లో నౌక అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్గిమాపక సిబ్బంది ప్రాణాలు అర్పించారు. ఈ ప్రమాదంలో సిబ్బందితోపాటు 345 మంది స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన అమరులకు నివాళులు అర్పించడం జరుగుతుందని డీఎఫ్ఓ పరమేశ్వర్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు పలు సముదాయాల వద్ద ప్రజలకు అగ్ని ప్రమాదల నివారణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.ఈ నెల 20 వ తేదీ ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కరపత్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విడుదల చేస్తారని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక పరికరాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ నిజామాబాద్ స్టేషన్ ఆఫీసర్ శంకర్, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు 

నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నేస్తం ఫౌండేషన్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, అణగారిన వర్గాల హక్కుల కోసం జరిగిన పోరాటానికి నిదర్శనమని కొనియాడారు. “బోధించు, సమీకరించు, పోరాడు” అనే నినాదంతో సమాజంలో చైతన్యం నింపిన మహనీయుడని ఆయన సేవలను స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు వంశీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరెళ్ల దినేష్, అఖిల్, సాయి, నాని, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

భైంసాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

0

భైంసాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా భైంసాలో డా.బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ చేసిన గొప్ప సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సామాజిక న్యాయానికి పునాది అని పేర్కొన్నారు. బైంసా పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులను త్వరలోనే ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించనున్నట్లు స్పష్టం చేశారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: మాజీ మంత్రి జోగు రామన్న

బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ సాత్నాల మండల అధ్యక్షునిగా గేడం జగన్నాథ్ 

పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ సాత్నాల మండల అధ్యక్షునిగా గేడం జగన్నాథ్ 

చిత్రం న్యూస్, సాత్నాల: పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నగేష్ ఆధ్వర్యంలో మంగవారం పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ సాత్నాల మండల అధ్యక్షునిగా గేడం జగన్నాథ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జగన్నాథ్ మాట్లాడుతూ..సాత్నాల మండలంలోని పర్ధాన్ సామాజిక వర్గ అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్ధాన్ జనజాతి జాతీయ నాయకుడు సిడాం రాంకిషన్, జిల్లా అధ్యక్షుడు గొడం గంగారాం, జిల్లా ఉపాధ్యక్షుడు నైతం సంతోష్, మండల నాయకులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.

ఖానాపూర్‌లో బీజేపీ ఘనవిజయం: భారీ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర నేతలు

ఖానాపూర్‌లో బీజేపీ ఘనవిజయం: భారీ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర నేతలు

చిత్రం న్యూస్,ఖానాపూర్: రాజకీయ కుట్రలను ఛేదించి ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోవడం చారిత్రాత్మకమని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. ఈ విజయోత్సవం సందర్భంగా సోమవారం ఖానాపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, ఎంపీ గోడం నగేష్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలతో కలిసి పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికార అహంకారంతో ఎన్ని కుట్రలు చేసినా, ప్రలోభాలకు గురిచేసినా ఖానాపూర్ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత విజయాన్ని స్వర్గీయ రాథోడ్ రమేష్ గారికి అంకితం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఖానాపూర్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడిందని, ఇదే ఉత్సాహంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

సమాజ సేవలో రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం 

సమాజ సేవలో రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం 

*వినికిడి సాధన పరికరాల పంపిణీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  సమాజ సేవలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, సేవలు అభినందనీయంమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని బర్కత్పుర లో గల రోటరీ కేంద్రంలో సోమవారం వినికిడి సాధన పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రోటరీ అంటేనే సేవా కార్యక్రమాలతో పేరుపొందిందన్నారు. వికలాంగులకు జైపూర్ కాళ్ళను అందించడం, వినికిడి సమస్య ఉన్నవాళ్లకు పరికరాలు అందించడం అభినందనీయమన్నారు. గతంలోనూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు. నగరవాసులు రోటరీ క్లబ్ అందజేసే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వినికిడి లోపం ఉన్నవారు, మొహమాటం పడకుండా పరికరాలను వాడాలని సూచించారు. ధన్ పాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో రెండు లక్షల విలువ గల వినికిడి పరికరాలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 18 మందికి వినికిడి సాధన పరికరాలను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు జగదీష్ కులకర్ణి, దాంపల్లి జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షుడు శ్యాం అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, రోటరీ ట్రస్ట్ చైర్మన్ ఆకుల అశోక్, క్లబ్ డైరెక్టర్ రాజ్కుమార్ సుబేదార్, కార్యనిర్వాహణాధికారి డాక్టర్ హరీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

జీజీహెచ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొ.డా.నాగమోహన్

జీజీహెచ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొ.డా.నాగమోహన్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఫోరెన్సిక్ హెడ్ ప్రొఫెసర్ డా.నాగమోహన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్న నాగమోహన్ కు ఇంచార్జి సూపరింటెండెంట్ గా నియమిస్తూ డీఎంఈ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. సూపరింటెండెంట్ గా పని నిజామాబాద్ ఇంచార్జి సూపరింటెండెంట్ గా పని చేసిన శ్రీనివాస్ స్థానంలో నాగమోహన్ ను నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. డా. నాగమోహన్ ను మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తో పాటు జీజీహెచ్ డిప్యూటీ సూపరిండెంటెంటు, ఆర్ఎంవోలు, సీనియర్ రెసిడెంట్, జూనియర్ డాక్టర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ పెద్దోళ్ళ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది నాగమోహన్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.

అనాథ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత

అనాథ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత

*నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సమాజంలో అనాధ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత అని, వారిని ఆదుకోవడం ద్వారా మనుష్యత్వాన్ని చాటుకోవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్ లో గల నిర్మల్ భవన్ లో అనాధ వృద్ధాశ్రమాన్ని సోమవారం సీపీ సందర్శించారు. అక్కడ నివసిస్తున్న అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులతో ఆత్మీయంగా మాట్లాడి, వారి ఆరోగ్యం, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న సహాయం కూడా వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, అందరూ సేవాభావంతో ముందుకు రావాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్ చార్జి ఏసీబీ రాజా వెంకటరెడ్డి టాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సౌత్ రూరల్ సీఐ సతీష్ కుమార్, టాఫిక్ సీఐ ప్రసాద్, టాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్, టౌన్ 6 ఎస్ఐ వెంకట్ రావ్, గ్రామ సర్పంచ్ నరాల జ్యోతి, నిర్మల్ భవన్ సిస్టర్ రోసుమ్మ, గామ ప్రజలు పాల్గొన్నారు.