ఓని గ్రామంలో మారెమ్మ, మైసమ్మ నూతన విగ్రహాల ప్రతిష్టాపన
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఓని గ్రామంలో మంగళవారం మారెమ్మ, మైసమ్మ, నూతన విగ్రహాలను ప్రతిష్టించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో గత కొన్ని దశాబ్దాల కాలం నుండి పాత విగ్రహాలకి పూజలు నిర్వహిస్తున్న భక్తులు ఈ సంవత్సరం గ్రామస్తులంతా కలిసి అందరి నిర్ణయంతో నూతన విగ్రహాలకు ప్రతిష్టాపన చేశారు. నర్సింగ్ రావు మహారాజ్ మంగళవారం ఉదయం మహా చండీ హోమం చేపట్టారు. అనంతరం మహిళలు మహా మంగళహారతులు పట్టుకొని భాజా భజంత్రీల మధ్య శోభాయాత్ర చేపట్టి పోచమ్మ మహాలక్ష్మి వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమం స్వీకరించారు.మారెమ్మ మైసమ్మ ను మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు పాడి పంటలతో, సుఖశాంతులతో కలిగి ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.

