సమాజ సేవలో రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం
*వినికిడి సాధన పరికరాల పంపిణీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సమాజ సేవలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, సేవలు అభినందనీయంమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని బర్కత్పుర లో గల రోటరీ కేంద్రంలో సోమవారం వినికిడి సాధన పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రోటరీ అంటేనే సేవా కార్యక్రమాలతో పేరుపొందిందన్నారు. వికలాంగులకు జైపూర్ కాళ్ళను అందించడం, వినికిడి సమస్య ఉన్నవాళ్లకు పరికరాలు అందించడం అభినందనీయమన్నారు. గతంలోనూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు. నగరవాసులు రోటరీ క్లబ్ అందజేసే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వినికిడి లోపం ఉన్నవారు, మొహమాటం పడకుండా పరికరాలను వాడాలని సూచించారు. ధన్ పాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో రెండు లక్షల విలువ గల వినికిడి పరికరాలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 18 మందికి వినికిడి సాధన పరికరాలను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు జగదీష్ కులకర్ణి, దాంపల్లి జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షుడు శ్యాం అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, రోటరీ ట్రస్ట్ చైర్మన్ ఆకుల అశోక్, క్లబ్ డైరెక్టర్ రాజ్కుమార్ సుబేదార్, కార్యనిర్వాహణాధికారి డాక్టర్ హరీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

