Home Blog Page 27

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వీయ జనగణన నమోదు

0

స్వీయ గణన పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న మొదటి విడత జనగణన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన (Self-Enumeration) పోర్టల్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ డిజిటల్ జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

స్వీయ గణన పోర్టల్‌ను ఉపయోగించడం వల్ల ప్రజల విలువైన సమయం ఆదా అవుతుందని, వివరాల నమోదు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సామాన్య ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని, జనగణనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్ ద్వారా ఎవరికి వారు తమ వివరాలను స్వయంగా వెబ్‌సైట్‌లో పొందుపరచవచ్చని ఆయన వివరించారు.

జనగణన ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు.

సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం: హాజరైన యువజన కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్ రెడ్డి

0

సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం: హాజరైన యువజన కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని సాంగిడి గ్రామానికి చెందిన బోరత్ వార్ అమ్మక్క-రాజు దంపతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ‘సారె’ అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు సొంత ఇంటి కల నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. బేల మండలంలో అర్హులైన వారందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్, సామ నర్సారెడ్డి, వార్డ్ మెంబర్ మంచికంటి ఉషన్న, మంచికంటి సాయి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, నల్ల వెంకట్ రెడ్డి, ప్రకాష్ నవగరే, రవీందర్ పటేల్, దేవన్న, సుధాకర్, సతీష్, సామ గణేష్ రెడ్డి, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా దంపతులు

0

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా దంపతులు

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా  కుటుంబీకులతో కలిసి ఆదివారం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందించారు. కలెక్టర్ వెంట ఆలయ ఏఈఓ గంగ ప్రసాద్, ఆలయ అధికారులు, పండితులు తదితరులు ఉన్నారు.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మైనార్టీ గురుకుల విద్యార్ధులకు కలెక్టర్ రాజర్షి షా ఘన సన్మానం

0

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మైనార్టీ గురుకుల విద్యార్ధులకు కలెక్టర్ రాజర్షి షా ఘన సన్మానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ‘ప్రజాపాలన – ప్రత్యేక ప్రణాళిక సంక్షేమ వారోత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని బంగారిగూడ మైనార్టీ గురుకుల బాలికల కళాశాల-2లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాలకు పేరు తెచ్చిన విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కలీం అహ్మద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, మావల ఇంచార్జ్ ఎంపీడీవో కృష్ణవేణి, మైనార్టీ బాలికల కళాశాల-1 ప్రిన్సిపల్ ఫర్హీన్ సుల్తానా, మైనార్టీ బాలికల కళాశాల-2 ప్రిన్సిపల్ రజిని, అధ్యాపకులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌ సాయితేజను అభినందించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

0

బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌ సాయితేజను అభినందించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ నాయకుడు కుమ్మరి పెళ్లి సాయితేజను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా సాయితేజను శాలువాతో సన్మానించిన ఎంపీ రఘునందన్ రావు, ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ పటిష్టత కోసం ముఖ్యంగా సోషల్ మీడియాలో బీజేపీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువ నాయకత్వం కీలక పాత్ర పోషించాలని రఘునందన్ రావు ఆకాంక్షించారు. సాయితేజ తన కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకాన్ని ఈ సందర్భంగా ఎంపీ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

భీంసరి వంతెన నిర్మాణానికి భూమిపూజ.. అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

భీంసరి వంతెన నిర్మాణానికి భూమిపూజ.. అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి  గ్రామ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న  గ్రామ వంతెన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ రూ.3 కోట్ల వ్యయంతో భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత పాలకులు కేవలం మాటలకే పరిమితమై అభివృద్ధిని విస్మరించారని ఆయన విమర్శించారు. తాము చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా నియోజకవర్గ అభివృద్ధిని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  భీంసరి గ్రామ సర్పంచ్ గౌరు కార్తీక్, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బాసర అమ్మవారి ఆలయంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ పూజలు

0

బాసర అమ్మవారి ఆలయంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ పూజలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు హరీష్ శంకర్ ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు,అధికారులు దర్శకుడికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్, మిరపకాయ్ వంటి సినిమాలు విజయవంతం కావడానికి అమ్మవారి ఆశీస్సులేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కొండగట్టు అంజన్న స్వామి ఆలయ అభివృద్ధి జరిగేందుకు కృషి చేస్తున్నారని, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం వారిని కూడా ఇక్కడికి తీసుకువచ్చి తన వంతుగా ఆలయ అభివృద్ధికి తోడ్పడే విధంగా చర్యలు చేపడతానన్నారు.వీరి వెంట ఆలయ ఏఈఓ గంగా శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ సాయిలు, సీ సీ పర్యవేక్షకులు సాయి, అర్చకులు పవన్ దీక్షిత్ బాసర్కర్ హరీష్, వేద పండితులు సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

బాసర అమ్మవారి సన్నిధిలో మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు  

0

బాసర అమ్మవారి సన్నిధిలో మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు  

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. వీరికి ముందుగా ఆలయ అర్చక వైదిక బృందం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి హారతి, తీర్థ, ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. వీరి వెంట డీసీసీ ఉపాధ్యక్షులు మమ్మాయి రమేష్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నాగరాజు, మల్కాజిగిరి జిల్లా కార్పొరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

విశ్వప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలుh

0

విశ్వప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

చిత్రం న్యూస్, మంచిర్యాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీ విశ్వప్రసాద్ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో, వారి కుటుంబాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు.

శుక్రవారం మంచిర్యాలలోని విశ్వప్రసాద్ నివాసానికి వెళ్లిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంఛు శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్, ఇతర నేతలు ఆయనను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పరామర్శించిన వారిలో ఆదిలాబాద్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మల్లేష్, బోథ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆదిలాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్,n జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ఆదిలాబాద్‌లో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల మెరుపు దాడులు: భారీగా పత్రాలు సీజ్

0

ఆదిలాబాద్‌లో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల మెరుపు దాడులు: భారీగా పత్రాలు సీజ్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అమాయక ప్రజలను, రైతులను అధిక వడ్డీలతో వేధిస్తున్న వడ్డీ మాఫియాను అరికట్టడమే లక్ష్యంగా ఈ భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లాలోని 16 మండలాలు, 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 45 పోలీసు బృందాలు పాల్గొని వడ్డీ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై ఇప్పటికే 15 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడుల సమయంలో అక్రమంగా కలిగి ఉన్న ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, బాండ్ పేపర్లు  సేల్ డీడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రైతుల నుంచి వ్యవసాయ భూములను తాకట్టు పెట్టుకుని, అధిక వడ్డీలతో వారిని ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. భూకబ్జాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని, ప్రజలు ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.