-Advertisement-

వృద్ధురాలికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’

వృద్ధురాలికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’

చిత్రం న్యూస్,వరంగల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమార్థంగా భావించే ‘సనాతన హిందూ సేవా సమితి’ తన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించింది.  ఈ సంస్థ తన 175వ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.

వరంగల్ వెంకట్రామా థియేటర్ సమీపంలోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన పేర్ణ ఎల్లమ్మ అనే వృద్ధురాలు, ఎటువంటి ఆధారం లేక ఆరోగ్య సమస్యలతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో మగ్గుతోంది. ఆమె దీనస్థితిని గమనించిన సనాతన హిందూ సేవా సమితి సభ్యులు, మానవత్వంతో స్పందించి ఆమెకు రెండు నెలలకు సరిపడా బియ్యం మరియు నిత్యావసర వస్తువులను అందజేశారు.

ఈ సందర్భంగా గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్ మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే తమ సంస్థ ప్రధాన ఉద్దేశమని, ఇప్పటివరకు 175 కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సాయం అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రూప్ అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, సలహాదారు ప్రతాపగిరి గణేష్‌తో పాటు సభ్యులు బడుగు రాము, గంగిడి ధర్మారెడ్డి, పేర్ణ భరత్, దీకొండ అమర్నాథ్, పెరుమాండ్ల శ్రవణ్, దిడ్డి మోహన్, బండారి సంపత్, ఓదెల తిరుపతి తదితరులు పాల్గొని వృద్ధురాలికి సాయం అందించారు. తమ వంతు సాయం అందినందుకు వృద్ధురాలు ఎల్లమ్మ కన్నీటి పర్యంతమవుతూ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments