నర్సంపేట లో కాషాయ జెండా ఎగురవేస్తాం: బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధీమా
చిత్రం న్యూస్,వరంగల్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు.
జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ నాయకులతో కలిసి జరిగిన ఈ భేటీలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాంచందర్ రావు గారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు మరియు వివిధ మోర్చాల బాధ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో ఈ పర్యటన కొత్త ఉత్సాహాన్ని నింపింది




