Home Blog Page 26

సింహాచల క్షేత్రంలో భక్తులకు ‘చందన ప్రసాదం’ పంపిణీ

0

సింహాచల క్షేత్రంలో భక్తులకు ‘చందన ప్రసాదం’ పంపిణీ

చిత్రం న్యూస్, సింహాచలం: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి  దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు విశేషమైన “చందన ప్రసాదం” పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జె. వెంకట్రావు తెలిపారు.

చందన ప్రసాదం విక్రయం  ఈ నెల 28 ఉదయం 8  గంటల నుండి దేవస్థానం ప్రసాద కౌంటర్ల వద్ద ప్రారంభమవుతుందన్నారు. ప్రతి చందన ప్రసాదం ప్యాకెట్ ధర రూ.10 మాత్రమే నిర్ణయించడం జరిగిందన్నారు.

ప్రతి భక్తుడికి ఒక్క టికెట్ (ఒక ప్యాకెట్) మాత్రమే జారీ చేస్తామని, ప్రసాదం పొందదలచిన భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు (అసలు లేదా జిరాక్స్ ప్రతిని) వెంట తీసుకురావలసిందిగా సూచించారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, కోరారు.

దుశ్చర్లను పరామర్శించిన సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

0

దుశ్చర్లను పరామర్శించిన సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

చిత్రం న్యూస్, సూర్యాపేట: ఇటీవల దాడిలో గాయపడి హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జన సాధన సమితి అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణను మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. సోమవారం ఆసువత్రికి వెళ్లిన ఆయన ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలన్నారు. ధైర్యంగా ఉండాలని దుశ్చర్లకు సూచించారు.

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన దహిగావ్ గ్రామ సర్పంచ్ భోక్రె శంకర్

0

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన దహిగావ్ గ్రామ సర్పంచ్ భోక్రె శంకర్

చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దహిగావ్ గ్రామంలో బాల వికాస ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ భోక్రె శంకర్ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా మూతబడిన పాడైపోయిన వాటర్ ప్లాంట్ ను పునఃరుద్దరించామన్నారు. ఈ ఎండాకాలంలో ప్రజల దాహార్తి కోసం ప్లాంటును ప్రారంభించామన్నారు. ప్రస్తుతం మినరల్ వాటర్‌ తాగుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే మినరల్ వాటర్‌ తాగే వారు. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా మినరల్ వాటర్‌ తాగుతున్నారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని  ఈ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించానన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రసూన్ రెడ్డి, ఫీల్డ్ కోఆర్డినేటర్ నరేందర్ బోయర్, గ్రామస్తులు రాందాస్ నాక్లే, హులేకే బాపూరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

బేలలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

0

బేలలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రం లో సోమవారం ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ కళ్లెం ప్రమోద్ రెడ్డి తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఉద్యమ శక్తి బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన ఈ మహత్తర ప్రయాణం ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితం. గ్రామం నుంచి రాష్ట్రం వరకు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తూ, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణవాడికి గర్వకారణమన్నారు.

తెలంగాణ కోసం పుట్టి, తెలంగాణ కోసం పోరాడి, తెలంగాణ కోసం నిరంతరం సేవలందిస్తున్న ఈ పార్టీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఒల్లప్ వార్ దేవన్న, ఠాక్రె గంభీర్, అడాణేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, సర్పంచులు విపిన్ ఖోడె,కుడ్మెత శతృఘన్,వైద్య కిషన్ రావు, ఠాక్రే మంగేష్, మస్కె తేజరావు, పవార్ ప్రకాష్,కొడాపే అరుణ్, ధోటె ప్రఫుల్, చవాన్ సుధాకర్, సోడెం సురేష్,గోడె విశాల్,రాథోడ్ మాధవ్, పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం: ఆదిలాబాద్‌లో జోగు రామన్న ఆధ్వర్యంలో వేడుకలు

0

ఘనంగా బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం: ఆదిలాబాద్‌లో జోగు రామన్న ఆధ్వర్యంలో వేడుకలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి , బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ జెండాను ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 27 ఏప్రిల్ 2001న జలదృశ్యంలో కేసీఆర్ నేతృత్వంలో స్థాపించబడిన ఈ పార్టీ, నేటికి 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ ఏట (రజతోత్సవ ఏడాది) అడుగుపెడుతోందని తెలిపారు.తెలంగాణ ఆత్మగౌరవం కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో మిఠాయిలు పంపిణీ చేశారు, జై తెలంగాణ నినాదాలతో కార్యాలయం మారుమోగింది. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి బీఆర్‌ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతుల రాస్తారోకో

0

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతుల రాస్తారోకో

చిత్రం న్యూస్, దండేపల్లి : వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి మండలంలో సోమవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. యాసంగి పంట కోతలు పూర్తయినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను ఇంట్లో నిల్వ ఉంచుకోవడం కష్టంగా మారిందని, మార్కెట్‌లో సరైన ధరలు లభించక నష్టపోతున్నామని తెలిపారు.

అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

జన గణన స్వీయ నమోదును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

0

జన గణన స్వీయ నమోదును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

చిత్రం న్యూస్, సూర్యాపేట:  తెలంగాణ రాష్ట్రంలో జనగణన–2027లో భాగంగా స్వీయ నమోదు పోర్టల్ ను (Self-Enumeration) ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీయ గణన పోర్టల్ ను ఉపయోగించడం వల్ల విలువైన సమయం ఆదా అవుతుందన్నారు. వివరాల నమోదు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జనగణనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ కరీం, మున్సిపాలిటీ TPO సోమయ్య, రాజు,బిక్షం,  మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కడంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0

కడంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చిత్రం న్యూస్, కడెం: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడం మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కడం మండల అధ్యక్షులు నల్ల జీవన్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. పార్టీ జెండా ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూ రావు, పార్టీ సీనియర్ నాయకులు పల్లె మల్లారెడ్డి, ముబారక్ బీన్ మొహమ్మద్, ఇస్లావత్ గంగన్న, వేణుగోపాల్ నాయక్, రాజేశ్వర్ గౌడ్, నరసయ్య, మల్లేష్, హసీబ్, సపవాత్ రవి, కానగంటి మల్లేష్, జీల నాగ రాజు, బీఆర్ఎస్ పార్టీ కొండుకూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు కళ్లెం తిరుపతిరెడ్డి, పాండాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు గంగాధర్, కడం గ్రామ కమిటీ అధ్యక్షులు కే రవి, నాయకులు కోల నరేష్, జాడి నరసయ్య, కోటయ్య ,చిట్టేటి గణేష్, సమ్మేటి రాజన్న, నవీద్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జైనథ్ లో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం

0

జైనథ్ లో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం

చిత్రం న్యూస్, జైనథ్: భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జైనథ్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాలే ధ్యేయంగా పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్ అని, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పులవేణి గణేష్ యాదవ్,  లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, నితిన్ రెడ్డి, దీపాయిగుడ ఉప సర్పంచ్ స్వామి, మాదస్తు వెంకన్న, పిడుగు స్వామి యాదవ్, అశన్న,పార్టీ ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

0

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా ముథోల్ మండలం గాన్నోరా గ్రామంలో డా. బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు గ్రామంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. గ్రామ సర్పంచ్. రాజు, ముథోల్ సబ్ ఇన్స్పెక్టర్ బిట్ల పెర్సిస్ పంచరంగి జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆయన చూపిన మార్గంలో నడవాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సామాజిక న్యాయానికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దాస సుధాకర్, మనోహర్, ఉప సర్పంచ్ పెంటన్న , ప్రముఖ జానపద గాయని, లక్ష్మి, అష్ట గంగాధర్, రాజేశ్వర్. గ్రామస్తులు తదితరులు ఉన్నారు.