Home Blog Page 154

మరిడమ్మ అమ్మవారి  జాతర ప్రారంభానికి ఏర్పాట్లు                         

0

మరిడమ్మ అమ్మవారి  జాతర ప్రారంభానికి ఏర్పాట్లు               

చిత్రం న్యూస్, పెద్దాపురం:

శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాడ మాస జాతర మహోత్సవములు ఈ నెల జూన్ 24 వ తారీకు నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ ,కార్య నిర్వహణాధికారిణి కె.విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం అమ్మవారి గోపురం నీటితో శుభ్రపరిచారు. గురువారం ఉదయం 8:49 నిముషాలకు అమ్మవారి పందిరి రాట ముహూర్తం సందర్బంగా అమ్మవారి భక్తులు రాటకు పసుపు, కుంకుమతో పూసి సిద్ధం చేశారని ఆమె తెలిపారు.

 

హుజురాబాద్ లో  మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు సేవ్ ద ట్రీ  నాయకుల వినతి

హుజురాబాద్ లో  మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు సేవ్ ద ట్రీ  నాయకుల వినతి

చిత్రం న్యూస్, హుజురాబాద్

హుజరాబాద్ పట్టణంలో వాడవాడలో విరిగిన మొక్కల స్థానంలో  మళ్లీ మొక్కలు నాటాలని అందుకు ఇప్పటినుండి ఏర్పాట్లు చేయాలని  సేవ్ ద ట్రీ నాయకులు, స్థానికులు మున్సిపల్ కమిషనర్  సమ్మయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగిన చెట్లు తీసివేసి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, వాడవాడలా సిసి రోడ్ల చివర మొక్క నాటే స్థలం కోసం డ్రిల్లింగ్ చేసి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవ్ ద ట్రీ గౌరవ అధ్యక్షుడు సాదుల రవీంద్రబాబు, అధ్యక్షుడు మాట అనిల్, ప్రధాన కార్యదర్శిలు మక్కా పల్లి రమేష్, కుడికాల ప్రభాకర్, ప్రకాష్, విశ్రాంతి ,విక్రమ్ తదితరులు పాల్గొన్నారు

తుమ్మనపల్లిలో సొంత ఖర్చులతో శ్మశానవాటిక  నిర్మాణం

తుమ్మనపల్లిలో సొంత ఖర్చులతో శ్మశానవాటిక  నిర్మాణం

*హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణయ్ బాబుని అభినందించిన గ్రామస్తులు

చిత్రం న్యూస్, హుజురాబాద్:

కాంగ్రెస్ యువనేత, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణయ్ బాబు తుమ్మనపల్లిలో దశాబ్దాల కలను నెరవేర్చారు. సొంత ఖర్చులను వెచ్చించి శ్మశానవాటిక నిర్మాణానికి  స్వీకారం చుట్టారు.  గ్రామంలో చాలా కాలంగా శ్మశానవాటిక లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రణయ్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా గ్రామస్తులు వినతిపత్రం అందించగా స్పందించిన ప్రణయ్ బాబు స్థానిక పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం ఆలస్యం చేయకుండా  శ్మశానవాటిక నిర్మాణానికి సొంత ఖర్చుతో పనులు శ్రీకారం చుట్టారు. ప్రణయ్ బాబు తీసుకున్న ఈ నిర్ణయానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు,  ప్రణయ్ బాబు మాట ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభించడం గౌరవంగా అనిపిస్తుందని, ఇలాంటి నాయకుడు మాకు ఇప్పటివరకు కనిపించలేదు అంటూ  ప్రశంసలు కురిపించారు. గ్రామ అభివృద్ధికి ప్రణయ్ బాబు చేసిన  కృషికి స్థానికుల నుంచి మంచి ఆదరణ పొందాడు.

మెగా డీఎస్సీ నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

0

మెగా డీఎస్సీ నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

చిత్రం న్యూస్,అమరావతి :

జూన్ 6 నుంచి ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. మెగా డీఎస్సీ నిలుపుదల కోరుతూ వేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. డీఎస్సీ పరీక్షలపై స్టే కోరుతూ వేసినఅమరావతి అనుబంధ పిటిషన్లనూ కొట్టేసింది. హాల్ టికెట్లు ఇచ్చామని, పరీక్షలకు ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం పెట్టిన సమయానికి పరీక్షలు జరగనున్నాయి.

కాకినాడను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం 

0

కాకినాడను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం 

  • *ఎంపీ సానా సతీష్ బాబు

చిత్రం న్యూస్, కాకినాడ:  కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కొప్పవరంలోని ఎంపీ సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో టీడీపీ, బీజేపీ జిల్లా నాయకుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే వర్మలు మాట్లాడారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నారు. వెన్నుపోటు పేరుతో జగన్ రెడ్డి పార్టీ నిరసన చేయడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేసారు. వచ్చే నాలుగేళ్లలో కాకినాడ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎంపీ సానా సతీష్ బాబు వెల్లడించారు.

సిలిండర్ ఆటో ట్రాలీని ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్ లారీ

0

సిలిండర్ ఆటో ట్రాలీని ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్ లారీ

*త్రుటిలో తప్పిన ప్రమాదం. 

చిత్రం న్యూస్, హుజురాబాద్:

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ లతో వెళ్తున్న ట్రాలీ ఆటో ని వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకరు మండలంలోని సింగపూర్ గ్రామ శివారులో ఢీ కొట్టింది. దీంతో ట్రాలీ నడిరోడ్డు మీద బోల్తా కొట్టింది .అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురయ్యా యి. కొన్ని సిలిండర్లు లీక్ అయ్యాయి ట్యాంకర్ డ్రైవరు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయగా ట్యాంకర్ టైర్ కింద ఇరుక్కుపోయింది  ట్రాలీ ఆటోలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలు కాగా స్థానికులు 108 ద్వారా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో ఒకసారిగా వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేత జగన్

0

ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేత జగన్

*మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎంఎల్ఏ నిమ్మకాయల చిన రాజప్ప

చిత్రం న్యూస్, పెద్దాపురం:

ప్రజలకు వెన్నుపోటు పొడవటం జగన్ కుటుంబానికి వాళ్ళ తాతల కాలం నుంచి అలవాటని అలాంటి కుటుంబం నుండి వచ్చిన జగన్ వెన్నుపోటు అంటూ ప్రజల ముందుకు రావడం హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ.. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేత జగన్ రెడ్డని. జగన్ తన సొంత కుటుంబాన్నే వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. లిక్కర్ తదితర కేసుల్లో వైసీపీ నేతలు వరుసగా జైలుకు వెళ్లడంతో జగన్ కు వెన్నులో వణుకు పుడుతోందని, జగన్ ఓటమి తర్వాత తన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు వెన్నుపోటు అంటూ ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు డీఎస్సీ ప్రకటించి, దీపం పధకం అమలు చేశారని, రోడ్లకు మహర్దశ తీసుకొని వచ్చారని రాజప్ప అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజప్ప తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల అందజేత

0

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల అందజేత

* క్యాంప్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేసిన ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప

చిత్రం న్యూస్, పెద్దాపురం:

పెద్దాపురం పట్టణం లో ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. పెద్దాపురం పట్టణం క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబురాజు చేతుల మీదగా రామారావుపేట కు చెందిన రొంగల ఆనంద్ కు వెన్నెముక శస్త్ర చికిత్స నిమ్మిత్తం రూ. 67,038/-,రోడ్డు ప్రమాదం లో గాయపడిన పాత పెద్దాపురంకి చెందిన బొగ్గు వీరబాబు కి 81,965/- అందజేశారు. ఈ కార్యక్రమం లో తెలుగుయువత రాష్ట్ర కార్య


దర్శి మహ్మద్ అరీఫ్ అలీ, రంధి సత్యనారాయణ పాల్గొన్నారు.

అరుణాచల గిరి ప్రదక్షణ యాత్రకు ప్రత్యేక బస్ సౌకర్యం

0

అరుణాచల గిరి ప్రదక్షణ యాత్రకు ప్రత్యేక బస్ సౌకర్యం

*హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్

చిత్రం న్యూస్, హుజురాబాద్:

అరుణాచల గిరి ప్రదక్షణ యాత్రకు ఈ నెల 9న హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఉందని ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ బస్ స్టేషన్ నుంచి బస్ బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, మరుసటి రోజు 10వ తేదీన రాత్రి వరకు అరుణాచలం చేరుకుని, 11వ తేదీన అరుణాచల గిరి ప్రదక్షణ అనంతరము తిరిగి సాయంత్రం 4 గంటలకు ఆరుణాచలంలో బయలుదేరి 12వ తేదిన హుజురాబాద్ కి బస్ చేరుకుంటుందని తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుకు చార్జి పెద్దలకు రూ.4,500, పిల్లలకు రూ.3,800గా నిర్ణయించబడిందన్నారు. అడ్వాన్స్ బుకింగ్ కొరకు ఈక్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 9959225924, 9704833971, 9247159535, 9441404841 కి ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కుడా ఉన్నదని, ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎం సూచించారు.

ఘనంగా మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

0

ఘనంగా మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, హుజురాబాద్:

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన వేడుకలను మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  నాయకుల నడుమ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.  మాజీ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్,  బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు, వార్డ్ అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.