సర్కారు బడిలోనే విలువలతో కూడిన విద్య
చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ధర్మారావుపేట ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు భరత్, సత్తయ్య గురువారం సందర్శించారు. పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేసి, బోధన తీరును పరిశీలించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని అంచనా వేసి, పాఠ్యబోధనలో మరింత మెరుగులు దిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.bఅధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు విశ్వాసంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. విద్యతో పాటు విలువల ఆధారిత సంస్కారం కూడా పాఠశాలల్లోనే పెంపొందుతుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం, మౌలిక వసతులు, పరిశుభ్రత పరిస్థితులను కూడా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

