ప్రజా పాలనతో గ్రామాల అభివృద్ధికి వేగం
చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించి, సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల అవసరాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి పరస్పర సమన్వయం కీలకమని తెలిపారు.




