Home Blog Page 161

ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్

0

ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్

*అరగంట పాటు బస్సును ఆపి గొడవ చేసిన మహిళలు

*భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పంచాయతీ

*ఆధార్ కార్డుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో టికెట్ ఇవ్వని కండక్టర్ 

చిత్రం న్యూస్, భైంసా: ఆధార్ కార్డు అప్డేట్ లేదని ఫ్రీ టికెట్ ఇవ్వని విషయంలో అరగంట పాటు పంచాయతీ జరిగిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. భైంసా – నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో దాదాపు 20 మంది మహిళలు ప్రయాణించగా, ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ అడిగిన మహిళలకు, ఆధార్ కార్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందని, ఆ మహిళలకు కండక్టర్ టికెట్ ఇవ్వలేదు.

దీంతో భైంసా మండలం దేగాం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి కండక్టర్ తో మహిళను గొడవకు దిగారు. అరగంటసేపు బస్సు రోడ్డు మీద నిలిచి ఉన్నందున తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని మహిళలను బస్ లో  పంపించారు. గొడవ సద్దు మణిగింది.

అంతర్రాష్ట్ర రహదారిపై గుంతలను పూడ్చండి 

0

అంతర్రాష్ట్ర రహదారిపై గుంతలను పూశ్చాలని ఆర్&బీ అధికారి అజ్మత్ అలీకి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం 

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర క్రాస్ రోడ్డు నుండి సొనాల మండల కేంద్రం మీదుగా మహారాష్ట్ర వైపుకు వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై కనుగుట్ట సమీపంలో గల పెద్ద వాగు దగ్గర, కౌట, సాకేర గ్రామల సమీపంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పొచ్చర బంక్ నుండి కౌఠ వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లు బాగా పెరిగిపోయాయి.  వాటి వల్ల మలుపు వద్ద వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఈ అంతరాష్ట్ర మార్గం గుండా నిత్యం వందలాది వాహనాలు తమ రాకపోకలను కొనసాగిస్తుంటాయి. ఈ గుంతల కారణంగా ఇప్పటికే ఈ మార్గంలో పదుల సంఖ్యలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. ఈ మార్గంలో గుంతలతో పాటు రోడ్డు కి ఇరువైపుల పెరిగిన చెట్లు, ముళ్ల పొదలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డు పైకి వచ్చిన పొదల కారణంగా ముందర నుండి వచ్చే వాహనం కనిపించక పోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలకు నెలవుగా మారిన గుంతలను పూడ్చివేయడంతో పాటు రోడ్డుకు అడ్డంగా వచ్చిన పొదలను తొలగించాలని కోరుతూ బుధవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ బోథ్ మండల చైర్మన్ పూండ్రు ఆదిత్య రెడ్డి, కన్వీనర్ గొడిసెల రమణ గౌడ్ లు ఆర్&బీ అధికారి అజ్మత్ అలీకి వినతిపత్రంను అందజేశారు.

లక్క పురుగులు.. భయంతో వణుకుతున్న ప్రజలు

0

బేల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న ప్రజలు

లక్క పురుగులు.. భయంతో వణుకుతున్న ప్రజలు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన గోదాంలో గత రెండు సంవత్సరాల నుండి జొన్న, శనగలు ఇతర ధాన్యాలు టన్నుల కొద్ది నిల్వ ఉండడంతో లక్క పరుగుల బెడద తీవ్రమైంది. దీంతో మండల కేంద్రంలోని చుట్టుపక్కల కాలనీవాసులకు, గోదాం పక్కనే ఉన్న కేజీబీవీ పాఠశాలలో లక్కపురుగుల దాడికి జనాలు వణికిపోతున్నారు. ఇంటా బయట కుప్పలు తెప్పలుగా స్వైర విహారం చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 అయ్యిందంటే చాలు కిలో మీటర్ల దూరం వరకు లక్క పురుగులు పాకుతూ కాలనీలకు చేరుతున్నాయి.దీంతో జనాలు పడుకుందామంటే మంచం నిండా అవే పాకడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చిన్నారులు స్కిన్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. గత రెండు ఏండ్లుగా ఈ సమస్య ఉన్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో లక్క పురుగుల బెడద మరింత తీవ్రమౌతుంది. బుధవారం బేల మండల పోలీస్ స్టేషన్లో కాలనీవాసులు వచ్చి ఫిర్యాదు చేశారు వెంటనే గోదాం లో నిలువ ఉన్న ధాన్యాన్ని వేరే చోటకు తరలించి లక్క పురుగుల బెడదను అరికట్టాలని కాలనీ వాసులు కోరారు. ఈ సందర్భంగా  మాజీ సర్పంచ్ మస్కే తేజరావు మాట్లాడుతూ.. చూడటానికి చిన్న సమస్య అనిపించిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సాయంత్రం ఐదు అయిందంటే ప్రతి ఒక్కరిపై ఒళ్లంతా ఈ పురుగులే కనిపిస్తాయని పేర్కొన్నారు. గోదాంలో నుంచి లక్క పురుగులు బయటకు వెళ్లకుండా నిబంధనలున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వర్షాకాలం వచ్చిందంటే వీటి సమస్య పెరుగుతున్న క్రమంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై అధికారులు స్పందించకుంటే కాలనీవాసులతో కలిసి రోడ్డెక్కి ధర్నాలు,నిరసనలు చేపడతామని మార్కెట్ అధికారులకు హెచ్చరించారు.

డబ్బా పాలు వద్దు.. తల్లిపాలు ముద్దు

0

అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు

చిత్రం న్యూస్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు  సామూహిక శ్రీమంతాలు జరిపారు. ఈ సమావేశాల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత తల్లిపాల ప్రాధాన్యతను తెలియజేశారు.  ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వం పేద మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే అపోహాలను వీడి తల్లిపాలు త్రాగించాలని కోరారు. తల్లిపాల వలన బిడ్డ ఆయుష్షును పెంచిన వారవుతారని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. డబ్బా పాలు వద్దు… తల్లిపాలేముద్దని తెలియజేశారు. అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. గర్భిణీలు ప్రసవ సమయంలో సిజేరియన్ల వైపు వెళ్లకుండా సాధారణ కానుపు చేయించుకుంటే మంచిదని సూచించారు. ఆయా గ్రామాలలోని గర్భిణులకు శ్రీమంతాలు చేసి, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నరసవ్వ, పంచశీల, దేవలత, ఏఎన్ఎంలు జయ,రాజ కళ, ఆశ వర్కర్లు నర్మద, సంజన, గర్భిణీలు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్  జయంతి వేడుకలు

0

 ప్రొఫెసర్ జయశంకర్  జయంతి వేడుకల్లో స్వర్ణకారులు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు స్వర్ణకారుల కుటుంబంలో పుట్టి ఉపాధ్యాయ వృత్తితో జీవితం ఆరంభించి చిన్ననాటి నుంచి ఉద్యమ భావశీలి పొందిన ప్రొఫెసర్ జయశంకర్  జయంతి వేడుకలు ఇచ్చోడ మండల కేంద్రంలోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్వర్ణకారుల సంఘం మండల అధ్యక్షుడు తొగాడి లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ మలి ఉద్యమాలలో సిద్ధాంతకర్తగా ఉండి ఉద్యమానికి ఊపు తీసుకొచ్చి తెలంగాణ సాధనే లక్ష్యంగా తమ వివాహాన్ని చేసుకోకుండా ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్  కు హర్ష నివాళులును ప్రకటించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రొఫెసర్ జయశంకర్  ఆశయాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమకారులందరూ అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు అందరూ ముందుకెళ్లి ఉద్యమాలలో ప్రజలకు సేవ చేస్తూ ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం సభ్యులు సుదర్శన్, గణేష్, మారుతి రావు, గోపి, మల్లేష్, మహేందర్, సురేందర్ పాల్గొన్నారు.

ధర్నాలో పాల్గొననున్న సొనాల మండల కాంగ్రెస్ నాయకులు

0

 ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో  సొనాల మండల కాంగ్రెస్ నాయకులు

చిత్రం న్యూస్, సొనాల:  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో  బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలోపాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కాంగ్రెస్ నాయకులు  తరలివెళ్లారు.  ఈతామెంతో తమకంతా అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయకుండా బీసీలను మోసం చేస్తున్నందుకుగాను అధిష్టానం పిలుపుమేరకు ఢిల్లీ నడిగడ్డ పైన జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో పాల్గొననున్నామని తెలిపారు. కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, పట్టణ అధ్యక్షులు అనిల్, సీనియర్ నాయకులు గాజుల పోతన్న, కసిరి పోతన్న, మాజీ సర్పంచ్ వినోద్  పాల్గొన్నారు.

అట్టహాసంగా క్రీడా పోటీలు ప్రారంభం

0

అట్టహాసంగా క్రీడా పోటీలు ప్రారంభం

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ కిసాన్ గల్లి పాఠశాలలో స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..విద్యా రంగములో క్రమశిక్షణ, భారతీయ సంస్కృతిని రక్షించడములో శ్రీ సరస్వతీ విద్యాపీఠం మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు.శ్రీ సరస్వతీ విద్యాపీఠం అధ్యక్షులు తక్కళ్ల పల్లి తిరుపతి రావు మాట్లాడుతూ.. శరీర మాద్యమంఖలు, ధర్మ సాధనం మనము ఏమీ సాధించాలన్న మన శరీరము ఆరోగ్యం గా ఉండాలన్నారు.శరీరము ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యముగా ఉంటుందన్నారు .ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. ఒత్తిడి అంతా దూరం అవుతుందన్నారు. ఈ పోటీలు పాఠశాల స్థాయి నుండి ప్రారంభమై జిల్లా, రాష్ట్ర, క్షేత్ర, జాతీయ స్థాయిలకు విస్తరిస్తాయాన్నారు. ఈ క్రీడలలో మొదటి స్థానంలో నిలిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి శ్రీ సరస్వతి విద్యాపీఠం సంఘటన కార్యదర్శి పీ.శ్రీనివాస్ రావు,శైక్షణిక ప్రముఖ్ కృష్ణమాచార్యులు, క్షేత్ర సంగీత ప్రముఖ్ మెట్టొల్ల సాయినాథ్, విభాగ్ శైక్షణిక ప్రముఖులు, మూడు పాఠశాలల ప్రధానాచార్యులు పాల్గొన్నారు.

మహా గర్జన సభను విజయవంతం చేయండి

0

మహా గర్జన సభను విజయవంతం చేయండి

*పద్మశ్రీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

చిత్రం న్యూస్, భైంసా: ఆగస్టు 13న హైదరాబాద్‌లో జరిగే మహాగర్జన సభకు గ్రామంలో ఉన్న  పెన్షన్ దారులు  అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొనాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా, ఆర్మూర్ లో జరిగిన సభలో వికలాంగుల పెన్షన్ రూ.6 వేలు, వృద్దుల, వితంతువుల చేయూత పెన్షన్  రూ.4 వేలు, తీవ్రమైన వైకల్యం కలిగిన వారికి రూ.15 వేలు  పెంచాలని పద్మశ్రీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దివ్యాంగులు, వృద్ధుల పింఛన్‌ను పెంచకపోతే 13న హైదరాబాద్‌లో జరిగే మహాగర్జన సభను ఉద్ధృతం చేస్తామన్నారు.  నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం వాలేగాం గ్రామ కమిటీ అధ్యక్షులు కత్తి పోచారం, ఉపాధ్యక్షులు కదం పోతన్న, ప్రధాన కార్యదర్శి బీరోల్ల భోజన్న, కార్యదర్శి గంటల్కర్ సాయన్న పాల్గొని మంద కృష్ణ మాదిగని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు.

రిమ్స్ లో  బాధితులకు పరామర్శ

0

రిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న ఆత్రం సుగుణక్క, బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, రిమ్స్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పిప్పల్ ధరి గ్రామానికి చెందిన తొడసం సోనేరావు ఇంట్లో ఆదివారం సాయంత్రం సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఆరుగురికి గాయాలయ్యాయి .సోనేరావు తో సహా మరో అయిదుగురు తొడసం లక్ష్మణ్, బాపురావు, షేర్రావు, గంగాప్రసాద్, మహేష్ లను రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సేవలను రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సునిల్ జాదవ్, మావల మండల అధ్యక్షుడు ధర్మపురి చంద్ర శేఖర్, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, పరంకుశం వెంకటేష్ తదితరులు ఉన్నారు.

 

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు  విరాళం 

0

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి  విరాళం  అందజేస్తున్న బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విరాళం

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో ప్రజలు, యువకులు  ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం చేస్తున్నందున నిర్మాణం కొరకు తమ వంతు విరాళంగా రూ.31వేల ను బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదిలాబాద్ ఇంచార్జ్ బోస్లే బాజీరావు కార్య నిర్వాహకులకు మంగళవారం నగదును అందజేశారు. ఈ సందర్భంగా బోస్లే బాజీరావు మాట్లాడుతూ…భైంసా డివిజన్లోని ప్రజలు, యువకులు, నాయకులు  ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని ఆయన విగ్రహాలు పెట్టడం వారిలో చైతన్యానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. కలగళ్ల యువకులను ఆదర్శంగా తీసుకొని. ప్రతి గ్రామంలోనూ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయడం కోసం  అందరూ ముందుకు రావాలని  సూచించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.