Home Blog Page 155

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

0

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

*ఖరీఫ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి

*మండల వ్యవసాయ అధికారి రాజుల నాయుడు

చిత్రం న్యూస్, చిగురుమామిడి:
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల వ్యవసాయ అధికారి రాజుల నాయుడు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్ కి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. నకిలీ విత్తనాలను గుర్తించడానికి మండల వ్యాప్తంగా అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీ చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మండల వ్యాప్తంగా 24,600 ఎకరాలు వరి, మొక్కజొన్న 400 ఎకరాలు, 1500 ఎకరాలు పత్తి సాగు చేస్తున్నట్లు తెలిపారు.యూరియా, డిఏపి, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు విత్తనం రకం, కంపెనీ, రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు. రైతులకు ఎలాంటి  సందేహాలు ఉన్న తమను సంప్రదించాలని సూచించారు.

ఉన్నతాధికారుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టి

0

ఉన్నతాధికారుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టి

చిత్రం న్యూస్ సామర్లకోట:

ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏడాదిపాలన పూర్తి కానుండటంతో భారీగా బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తుంది. 10 జిల్లాలకు పైగా కలెక్టర్లు, 8 జిల్లాలకు పైగా ఎస్పీలు బదిలీ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా విద్యార్థుల తల్లిదండ్రులపై నమ్మకాన్ని పెంపొందించాలి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా విద్యార్థుల తల్లిదండ్రులపై నమ్మకాన్ని పెంపొందించాలి

*మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి

చిత్రం న్యూస్, సైదాపూర్:

ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా విద్యార్థుల తల్లిదండ్రులపై నమ్మకం తీసుకురావాలని మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం విద్య వనరుల కేంద్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన ముఖ్య సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేలా ప్రతి గ్రామంలో ఈనెల 6 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు పాఠశాలలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ కట్ట రవీంద్రచారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఆర్.ప్రభాకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ఎల్. సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఏం.ఐ.ఎస్.కో ఆర్డినేటర్, సీఆర్పీలు పాల్గొన్నారు.

సైదాపూర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు *అమరుల త్యాగాలు మరువలేనివి

సైదాపూర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

*అమరుల త్యాగాలు మరువలేనివి

చిత్రం న్యూస్, సైదాపూర్:

సైదాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, మహిళా సమాఖ్య, వ్యవసాయ, పాక్స్ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భూక్యా యాదగిరి, వ్యవసాయ అధికారి వైదేహి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండారపు శ్రీనివాస్, పాక్స్ ఛైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, వివిధ గ్రామశాఖ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  తెలంగాణ  రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు

చిత్రం న్యూస్,హుజురాబాద్: ‌ 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్  ఎగరవేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మక్కపల్లి కుమార్ స్వామి, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదవాడి సొంతింటి కల

ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదవాడి సొంతింటి కల

*హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

చిత్రం న్యూస్ శంకపట్నం:
శంకరపట్నం మండలంని ముత్తారం గ్రామంలో భూమి పూజ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పదేళ్ల నిరీక్షణ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పేదలకు పంచుతుంటే వారి నుండి అనూహ్య స్పందన వస్తుందని,పేదవారి సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నామనన్నారు. ముత్తారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాగోని బస్వయ్య గౌడ్ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. లబ్దిదారులకు పట్టాలు ఇస్తున్న క్రమంలో వారు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ మండలంలో ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదని,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మాత్రమే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని,మళ్ళీ పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకునే నాయకులు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విడతల వారిగా అర్హుడైన ప్రతి లబ్దిదారులకు పథకాలు అందజేస్తామని, రేషన్ కార్డులు,ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉచిత బస్ రవాణా సౌకర్యం లాంటి సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు యువకులు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి కుటుంబం

0

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి కుటుంబం

చిత్రం న్యూస్, తిరుపతి:
తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిని నల్లమిల్లి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అనపర్తి శాసననసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి సతీమణి నల్లమిల్లి సత్యవతి,యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి సుమేఘ దంపతులు,నల్లమిల్లి సనాతని,ప్రముఖ పారిశ్రామికవేత్త ఆవుల గిరి ప్రకాష్ రెడ్డి సుమల దంపతులు,ఆవుల మనీష్ రెడ్డి,కొయ్యాలమూడి శ్రీనివాస్ ప్రసాదిని దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరుల త్యాగాలు మరువలేనివి

చిత్రం న్యూస్, శంకరపట్నం :

శంకరపట్నం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరువలేని అన్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవం-చరిత్ర

0

తెలంగాణ అవతరణ దినోత్సవం – గర్వానికో ప్రతీక

ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన జరుపుకునే తెలంగాణ అవతరణ దినోత్సవం, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మీయతకు, ఉద్యమ సమరయోధుల త్యాగానికి గుర్తుగా నిలుస్తుంది. ఇది ఒక సాధారణ దినోత్సవం కాదు — ఇది తెలుగు రాష్ట్ర చరిత్రలోనే విశేషమైన మైలురాయి.


తెలంగాణ చరిత్ర – ఉద్యమం పునాది

తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా ఉన్న చరిత్ర 1948లోనే మొదలైంది. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం, భారతదేశంలో విలీనమైన తర్వాత, 1956లో “భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ” ప్రకారం, తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటిని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. కానీ, ఈ విలీనానికి తక్కువకాలంలోనే తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
వారు ఎదుర్కొంటున్న సమస్యలు:

  • నీటి పారుదల, విద్య, ఉపాధిలో అన్యాయాలు
  • ఉద్యోగాల్లో న్యాయపరమైన అవకాశాల కొరత
  • సంస్కృతిలో తేడాలు, ప్రాదేశిక నిర్లక్ష్యం

ఉద్యమాల విస్తరణ

1969లో మొదలైన జై తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల నుంచి సామాన్య ప్రజల వరకూ విస్తరించి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఊపందించింది. అయితే ఆ ఉద్యమం తాత్కాలికంగా నశించింది. తర్వాత 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కే.సీ.ఆర్) గారు తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ను స్థాపించి, ఉద్యమాన్ని కొత్త ఊపుతో కొనసాగించారు. “తెలంగాణ వస్తేనే బతుకుదెరువు” అనే నినాదం గ్రామాల నుడివాడిగా మారింది.

ఈ ఉద్యమంలో భాగంగా:

  • వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు
  • అనేకమంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేశారు
  • పార్లమెంటు స్ధాయిలో ఉద్యమం ఉద్భవించింది

2013 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. తుది ఆమోదం అనంతరం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది.


తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తరువాత

రాష్ట్రం ఏర్పడ్డ తరువాత అభివృద్ధికి కొత్త దిశలు పరిగెత్తాయి. ముఖ్యంగా:

  • మిషన్ కాకతీయ – చెరువుల పునరుద్ధరణ
  • మిషన్ భగీరథ – గ్రామాలకూ తాగునీటి సరఫరా
  • కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ – పెళ్లిళ్ల కోసం ఆర్థిక సహాయం
  • రైతు బంధు, రైతు బీమా – రైతుల కోసం ఆర్థిక భరోసా
  • TS-iPASS – పారిశ్రామిక రంగంలో వేగవంతమైన అనుమతులు
  • T-Hub, WE Hub – యువతకు స్టార్టప్ ప్రోత్సాహం

ఈ ప్రణాళికలు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ అభివృద్ధి, ఐటీ రంగంలో పురోగతి వంటి అంశాల్లో దేశంలో ముందంజలో ఉంది.


అవతరణ దినోత్సవం వేడుకలు

ప్రతి సంవత్సరం జూన్ 2న, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో:

  • ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ
  • ముఖ్యమంత్రి సందేశ ప్రసారం
  • ప్రభుత్వ పురస్కారాల ప్రదానం
  • సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా ప్రదర్శనలు
  • పాఠశాలలు, కళాశాలల్లో నాటకాలు, పాటలు, ప్రదర్శనలు

ఈ వేడుకలు తెలంగాణ కలను నిజం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసే ఒక అవధిగా నిలుస్తాయి.


ముగింపు

తెలంగాణ అవతరణ దినోత్సవం ఒక జ్ఞాపకం — ఉద్యమానికీ, త్యాగానికీ, గెలుపుకీ. ఈ రోజు ప్రతి తెలంగాణ వాసి గర్వపడే రోజు. ఇది యువతలో స్ఫూర్తిని నింపే రోజు. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడవాలన్న సంకల్పాన్ని గుర్తుచేసే రోజు.

“తెలంగాణ తల్లి విజయగాథ ఇది
తల్లిపాలే తీపిగా సాగే భవితవ్య గాథ ఇది.”

అమరుల త్యాగాలు మరువలేనివి

చిత్రం న్యూస్ శంకరపట్నం:
శంకరపట్నం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరువలేని అన్నారు.