Home Blog Page 14

విశ్వశాంతి విద్యార్థుల అ ‘పూర్వ’  సమ్మేళనం 

0
VISHWASHANTI HIGH SCHOOL
VISHWASHANTI HIGH SCHOOL

విశ్వశాంతి విద్యార్థుల అ ‘పూర్వ‘  సమ్మేళనం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  పదేళ్ల పాటు కలిసి చదువుకున్న వాళ్లంతా పదో తరగతి పూర్తికాగానే ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. 23 ఏళ్ల తర్వాత వారంతా ఆదివారం ఒకే చోట కలిసి సందడి చేశారు. ఇలాంటి అ ‘పూర్వ’ ఘట్టానికి ఆదిలాబాద్ పట్టణం వినాయక్ చౌక్ లోని హరివిల్లు ఈవెంట్స్ స్పేస్ వేదిక అయింది. విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో 2003-04 సంవత్సరం పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, గురువుల సన్మాన మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థిగా వెళ్లిపోయిన వారు తమ జ్ఞాపకాలకు గుర్తుగా తరలివచ్చారు.  పాఠాలు చెప్పిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఒక్కచోట కలవడంతో సంతోషపడ్డారు. తమ మధురానుభూతులను పంచుకున్నారు.  ఒకరినొకరు కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

ఒకే చోట కలిసి.. సందడి చేసి 

0

ఒకే చోట కలిసి.. సందడి చేసి 

2003-04 సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 

చిత్రం న్యూస్, జైనథ్:  అక్కడ అఆలు దిద్దినవాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. అక్కడి గురువులు నేర్పిన పాఠాలు ఎందరినో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లింది. పదేళ్ల పాటు కలిసి చదువుకున్న వాళ్లంతా పదో తరగతి పూర్తికాగానే ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. 23 ఏళ్ల తర్వాత వారంతా ఆదివారం ఒకే చోట కలిసి సందడి చేశారు. ఇలాంటి అపూర్వ ఘట్టానికి వేదిక అయింది జైనథ్ మండలంలోని దీపాయిగూడ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఆ బడిలో 2003-04 సంవత్సరం పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, గురువుల సన్మాన మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థిగా వెళ్లిపోయిన వారు తమ జ్ఞాపకాలకు గుర్తుగా తరలివచ్చారు. తమకు చదువు చెప్పిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఒక్కచోట కలవడంతో సంబరపడ్డారు. తమ మధురానుభూతులను పంచుకున్నారు. ఉపాధ్యాయులు  శ్యాంసుందర్, రామ్మోహన్, శ్రీకాంత్, సంజయ్, గణేష్, పూర్వ విద్యార్థులు తహసీల్దార్ నలందప్రియ, వాసవి, సౌజన్య, కళ్యాణి, జ్యోతి, రేష్మ, ఆస్మా, చైతన్య, మౌనిక, ప్రవీణ, సజన, స్వప్న, నైనత, ఓం ప్రకాష్, నరేష్, రాకేష్, సంజీవ్, ప్రశాంత్, రాజు, రాకేష్, శ్రీరామ్, దీపక్, తిరుపతి, కపిల్, రాము, బాలాజీ, యష్పాల్, మనోహర్, రతన్ తదితరులు పాల్గొన్నారు.

వెల్డింగ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కంది శ్రీనివాస రెడ్డి

0

వెల్డింగ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కంది శ్రీనివాస రెడ్డి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: వెల్డింగ్ ఓనర్స్, వర్కర్ల సమస్యల పరిష్కారానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు.ఆదివారం పట్టణంలోని తిర్పెల్లి డైమండ్ ఫంక్షన్ హాల్‌లో జమీల్ అధ్యక్షతన జరిగిన వెల్డింగ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నేతలు కంది శ్రీనివాస రెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసోసియేషన్ అభివృద్ధికి ఏ అవసరం వచ్చినా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు అసోసియేషన్ సభ్యులకు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ జ్యోతి యాత్రకు ఆదిలాబాద్‌లో ఘన స్వాగతం: రాజీవ్ సేవలు మరువలేనివి – కంది శ్రీనివాస రెడ్డి

0

రాజీవ్ జ్యోతి యాత్రకు ఆదిలాబాద్‌లో ఘన స్వాగతం: రాజీవ్ సేవలు మరువలేనివి – కంది శ్రీనివాస రెడ్డి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకార్థం తమిళనాడు శ్రీపెరంబదూర్ నుండి ఢిల్లీ వీరభూమి వరకు సాగుతున్న రాజీవ్ జ్యోతి యాత్ర ఆదివారం ఆదిలాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు యాత్రకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. 1984 నుండి 1989 వరకు ప్రధానిగా పనిచేసి దేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికిన మహనీయుడని కొనియాడారు. చిన్న వయసులోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటని అన్నారు. ప్రతి సంవత్సరం మెమోరియల్ యాత్ర నిర్వహిస్తున్న శామ్యూల్ ద్రవ్యమ్ బృందానికి అభినందనలు తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. యాత్రకు స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిజర్ పాషా, నాయకులు బెజ్జంకి అనిల్, మోతిరామ్, గౌలి సంజయ్, పరమేశ్వర్, శ్రీకర్ గౌడ్, కుదురుపాక సురేష్, కోలా నర్సింలు, తొడసం దౌలత్ రావు, షకీల్, రఫీక్, సురేందర్, డేరా కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో ఘనంగా ‘విద్యా విజయోత్సవం’ ముగింపు వేడుకలు: టాపర్లకు కలెక్టర్ సత్కారం

0

ఆదిలాబాద్‌లో ఘనంగా ‘విద్యా విజయోత్సవం’ ముగింపు వేడుకలు: టాపర్లకు కలెక్టర్ సత్కారం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక విద్యా వారోత్సవాలలో భాగంగా ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో ‘విద్యా విజయోత్సవం’ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం గత విద్యాసంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లను శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బాల కేంద్రం పుస్తక నిధి పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.

కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గణేష్ జాదవ్, ఏఎంఓలు లక్ష్మణ్, అజయ్, జిల్లాలోని పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, బోధన సిబ్బంది, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హంపోలి గ్రామంలో చెరువు మరమ్మత్తుల పనులకు శ్రీకారం

0

హంపోలి గ్రామంలో చెరువు మరమ్మత్తుల పనులకు శ్రీకారం

*రూ.39.50 లక్షల ఇరిగేషన్ నిధులతో పనులను ప్రారంభించిన ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని హంపోలి గ్రామంలో రూ.39.50 లక్షల ఇరిగేషన్ నిధులతో చేపట్టనున్న చెరువు మరమ్మత్తుల పనులను ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో చెరువుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ముఖ్యంగా పంట సాగు, వ్యవసాయ అవసరాల కోసం చెరువులు గ్రామాలకు జీవనాధారమని పేర్కొన్నారు.చెరువులు నిండుగా ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీటిమట్టాలు మెరుగుపడతాయని తెలిపారు. గ్రామస్తులంతా  ఏకమై చెరువులను పరిరక్షించుకోవాలని, చెరువుల ఆక్రమణలు, కాలుష్యాన్ని నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడేలా ప్రత్యేక దృష్టితో పనిచేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న ఇటువంటి అభివృద్ధి పనులు రైతులకు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. చెరువు మరమ్మత్తుల పనులు పూర్తయితే సాగునీటి సమస్యలు తగ్గడంతో పాటు పంటల ఉత్పత్తి కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సాగునీటి రంగం అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం సస్యశ్యామలం

0

సాగునీటి రంగం అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం సస్యశ్యామలం:ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రైతులంతా కలిసికట్టుగా ఉండి సాగునీటి రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో రూ. 37 లక్షల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తు పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్ లను రైతులందరూ కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. లోకేశ్వరం, ముథోల్, బాసర మండలాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లకు తన హాయంలో పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.లోకేశ్వరం మండలంలో హమ్ పథకంలో రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం జరిగిందని, ఏడాది లోపు మండలంలో 60 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రూ.50 కోట్ల నిధులతో అర్లి వంతెన నిర్మాణం చేపడతామన్నారు. ఆర్లి వంతెన విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. గత పది సంవత్సరాల కాలంలో అప్పట్లో పెద్ద మొత్తంలో నిధులు ఉన్న పాలకుల నిర్లక్ష్య మూలంగా రోడ్ల నిర్మాణం జరగలేదన్నారు. రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, కాస్త ఓపిక పట్టాలని, రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు అయ్యాయన్నారు. అదేవిధంగా 28 ప్యాకేజ్ పూర్తి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానని, నిధులు మంజూరు అయితే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. దశల వారీగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే తన ధ్యేయమన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధి కోసం ఐదు గంటల భూమి విరాళం

0

ఆలయ అభివృద్ధి కోసం ఐదు గంటల భూమి విరాళం

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రేణుకాపూర్ హనుమాన్ ఆలయం అభివృద్ధి కొరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన గౌతమ్ స్వచ్ఛందంగా ఐదు గుంటల భూమిని ఆలయానికి విరాళంగా అందజేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయన్ను శాలువాతో సన్మానించి, స్వామివారి తీర్థప్రసాలను అందజేశారు. ఆలయ పునర్నిర్మాణం ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ నూతన కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పనులు జరుగుతాయనీ ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు, భక్తులు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడవొద్దంటూ వామపక్ష పార్టీల రాస్తారోకో

0

ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడవొద్దంటూ వామపక్ష పార్టీల రాస్తారోకో

వామపక్ష పార్టీల ఆందోళనలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు కోత పెడుతూ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం అప్రజాస్వామిక చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ రహదారిపై నిర్వహించిన రాస్తారో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ పేరు చిరస్మరణీయమై నిలిచిపోయిందని, ఎవరూ ఆ పేరును చెరపలేరని అన్నారు.అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ నాయకత్వంలో గ్రామీణ పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు 100 రోజుల ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం కోట్లాది కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు.2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకానికి క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తోందని ఆరోపించారు. పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని, ఇది పేదలు, కూలీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని, మనుస్మృతి అమలు చేయాలనే పన్నాగంతో ముందుకు సాగుతోందని విమర్శించారు. లౌకికవాద దేశంలో మోదీ, అమిత్ షా పప్పులు ఉడకవని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామీణ కూలీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ జైనథ్ మండల అధ్యక్షుడిగా గడ్డం జగదీష్ రెడ్డి

0
Congress

 కాంగ్రెస్ జైనథ్ మండల అధ్యక్షుడిగా గడ్డం జగదీష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ జైనథ్ మండల అధ్యక్షుడిగా గడ్డం జగదీష్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు ఆయన నియామకం జరిగింది.  జైనథ్ మండల కేంద్రానికి చెందిన ఆయనకు పార్టీ అధిష్టానం పదవిని కట్టబెట్టింది. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం జగదీష్ రెడ్డిని మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.