Home Blog Page 13

ఘనంగా సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు

0

 ఘనంగా సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్ బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. అభిమానులు, స్థానిక పలు సర్పంచులు రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు జాదవ్ నరేష్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరి నడుమ రూపేష్ రెడ్డి కేకు కట్ చేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ళు జీవించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ఈ సందర్బంగా  కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు జాదవ్ నరేష్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో మండలంలోని గిరిజనులకు, నిరుపేదలకు ఏ చిన్న పని ఉన్న రుపేష్ రెడ్డి అంబులెన్స్ ల పని చేయడం అభినందనీయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో కూడా క్రియాశీలకంగా పని చేస్తున్నారన్నారు.అన్ని దానాల్లో రక్తదానం గొప్పదానం అని పేర్కొన్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 101 మంది కి పైగా రక్తదానము చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఉపాధి కూలీలకు అన్నదానం ఏర్పాటు చేసిన ఉప సర్పంచ్ టాక్రె సాగర్ 

0

 ఉపాధి కూలీలకు అన్నదానం ఏర్పాటు చేసిన ఉప సర్పంచ్ టాక్రె సాగర్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామ ఉప సర్పంచ్ టాక్రె సాగర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకుమంగళవారం అన్నదానం నిర్వహించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉపాధి కూలీలకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని అయన తెలిపారు.  కూలీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కనీస వసతులు కల్పించేలా అధికారులను కలిసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేస్రం దౌలత్,గ్రామ కార్యదర్శి హర్షద్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవరావు భారీగా ఉపాధి కూలీలు పాల్గొన్నారు

 

బీసీ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్

0

బీసీ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్ లను జాతీయ నాయకులు ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ లు మంగళవారం నియమించారు. నియామక పత్రాలను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్ బుధవారం పట్టణంలోని యాదవ భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారికి అందజేశారు. శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ…రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని తెలిపారు. అందుకు జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సంఘాన్ని బలోపేతం చేసేందుకు జిల్లా నూతన కార్యవర్గంను నియామకం చేసుకోవడం జరిగిందని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన ఎప్పటికపుడు పోరాటాలు ఉదృతం చేయాలని కోరారు.

ఈ సందర్బంగా నూతనంగా నియామకమయిన బీసీ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్ లు మాట్లాడుతూ..జాతీయ బీసీ సంక్షేమ సంఘం ( National backward classes welfare Association Reg.No 2187/92 )  తమను నియామకం చేసినందుకు జాతీయ, రాష్ట్ర సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్యకి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ కు, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీల సమస్యలపై ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ విద్యార్థుల, బీసీల అభ్యున్నతికి ఎల్లవేళలా పాటుపడతామని అన్నారు.

 బెల్లూరిలో విద్యుత్ తీగలు తెగిపడి నాలుగు ఆవులు మృత్యువాత 

0

 బెల్లూరిలో విద్యుత్ తీగలు తెగిపడి నాలుగు ఆవులు మృత్యువాత 

చిత్రం న్యూస్, జైనథ్: మండలంలోని బెల్లూరి గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ గాలివాన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ తీగలు తెగి కిందపడటంతో నాలుగు ఆవులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాయి. రాత్రి వేళ ఒక్కసారిగా వీచిన బలమైన గాలుల వల్ల విద్యుత్ లైన్లు తెగిపడ్డాయని స్థానిక రైతులు తెలిపారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఆవులు ఆ తీగలను తాకడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయని తెలిపారు. ఈ ఘటనతో లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

యువతకు ఉపాధి బాట: ఆదిలాబాద్‌లో కెరీర్ గైడెన్స్ సదస్సు ప్రారంభం

0

యువతకు ఉపాధి బాట: ఆదిలాబాద్‌లో కెరీర్ గైడెన్స్ సదస్సు ప్రారంభం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో యువతకు కెరీర్ గైడెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. జిల్లా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నైపుణ్య శిక్షణ కేంద్రాల ప్రతినిధులు, అధికారులను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ శ్రీనివాస్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ మనోహర్, జిల్లా ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పార్థసారథి, ఉట్నూరు, ఆదిలాబాద్ ATC ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్, శ్రీనివాస్, బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు ప్రవీణ్, రమేష్, NTT డేటా ప్రతినిధి మల్లికార్జున్, కళా అకాడమీ లెక్చరర్ వైష్ణవి, ఎన్‌లాప్స్ ఇండియా ప్రతినిధి ప్రణవి, పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆరోగ్య స్పృహకు నిదర్శనం: కొలాం గిరిజన రైతు కుటుంబం ఆదర్శం

0

.ఆరోగ్య స్పృహకు నిదర్శనం: కొలాం గిరిజన రైతు కుటుంబం ఆదర్శం

చిత్రం న్యూస్,సాత్నాల: మండలంలోని అడ్డగుట్ట గ్రామానికి చెందిన కొలాం గిరిజన రైతు కొడప అమృతరావు, జంగుబాయి దంపతులు ఆరోగ్యకరమైన జీవన విధానంతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న ఈ దంపతులు గ్రామంలోని పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తూ సమాజ సేవలో ముందున్నారు. తమ తల్లి బాటలో నడుస్తూ నిత్యం ఆహారంలో గానుగ నూనెను వాడుతున్నారు.

జంగుబాయి ప్రతిరోజూ రూ.10, 20 చొప్పున పొదుపు చేసి, ప్రతి రెండు నెలలకు ఒకసారి తమ కుటుంబానికి సరిపడా పల్లీలను కొనుగోలు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వాటిని యూనిట్‌కు తీసుకొచ్చి తమ కళ్ల ముందే స్వచ్ఛమైన గానుగ నూనె తయారు చేయించుకొని వాడుతున్నామని అమృతరావు తెలిపారు. ఆరోగ్యంపై అవగాహనతో సంప్రదాయ ఆహారపు అలవాట్ల వైపు మళ్లుతున్న ఇలాంటి కుటుంబాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఆదిలాబాద్‌లో డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం: స్నిఫర్ డాగ్ ‘రోమా’తో ముమ్మర తనిఖీలు

0

ఆదిలాబాద్‌లో డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం: స్నిఫర్ డాగ్ ‘రోమా’తో ముమ్మర తనిఖీలు

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహితంగా మార్చాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఈగల్ టీమ్ ఆదివారం పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో మెరుపు తనిఖీలు చేపట్టింది. బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ ప్రాంతాల్లో పోలీసులు అణువణువూ గాలించారు.

ఈ తనిఖీల్లో నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ ‘రోమా’ కీలకంగా వ్యవహరించింది. కాకర్ స్పానియల్ జాతికి చెందిన రోమా తన చురుకైన ఘ్రాణశక్తితో అనుమానిత బ్యాగులు, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసింది గతంలో కూడా రోమా సహాయంతో పలు చోట్ల గంజాయిని పట్టుకొని నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

“డ్రగ్స్‌కు నో చెప్పండి – మన యువతను రక్షించుకుందాం” అనే నినాదంతో ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బాసర నుంచి ఓనికి వెళ్లే రోడ్డుకు మోక్షమెప్పుడో…

0

బాసర నుంచి ఓనికి వెళ్లే రోడ్డుకు మోక్షమెప్పుడో…

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఓని నుంచి బాసర వెళ్లే రహదారికి తొలుత మోక్షం కలిగిందని గ్రామస్తులు సంబరపడ్డారు. అంతలోనే ఆ రోడ్డు  పనులు నిలిచిపోయాయి. గత కొన్ని సంవత్సరాలనుండి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనం, బ్యాంకు, మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు కూరగాయల మార్కెట్ కు వెళ్లాలన్న 25 గ్రామాల ప్రజలకు  ఈ దారే దిక్కు. వంతెన శితిలావస్థలో ఉండడంతో దానిపైనే సీసీ రోడ్డు పూర్తి చేశారు. ఓని నుంచి బాసర వెళ్లే రహదారి రూ.1.50 కోట్లతో మంజూరై నప్పటికీ ఎలాంటి స్పందన లేదు. వంతెన పై 200 మీటర్ల రోడ్డు వేసి ఆపేశారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ఇంకా రోడ్డు నిర్మాణం పూర్తి చేపట్టలేదని కష్టాలు తప్పడం లేదని స్థానికులు కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ కు ఆయా గ్రామాల సర్పంచులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సాకులు చెబుతూ దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వర్షాకాలం విత్తనాలకు వెళ్లాలన్న, ఎరువుల కోసం వెళ్లాలన్న కష్టాలు తప్పవని ప్రజలు అనుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ రహదారి కోసం నిధులు మంజూరు చేసిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు పనులు ఆగిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని రక్షించిన పోలీసులు

0

ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని రక్షించిన పోలీసులు

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని సోమవారం పోలీసులు రక్షించారు. బాసర సీఐ కిరణ్ కుమార్, తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్ జిల్లా మండలం రెంజల్ మండలం ధూపల్లె గ్రామానికి చెందిన బొట్టా సందీప్ (25) ఆర్థిక ఇబ్బంది,  ఇంట్లో గొడవల కారణంగా మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో  గోదావరి నది తీరం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు . హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించి బాధితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కుటుంబీకులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాణాల్ని కాపాడిన బాసర ఏఎస్ఐ గంగాధర్, నరేందర్ చారి, సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు

ఆదిలాబాద్‌లో ఉత్సాహంగా 5K మారథాన్: విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాల అందజేత 

0

ఆదిలాబాద్‌లో ఉత్సాహంగా 5K మారథాన్: విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాల అందజేత 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి 5K మారథాన్ రన్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభించారు. ఈ రన్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమై కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, అంబేడ్కర్ చౌక్ మీదుగా తిరిగి స్టేడియం వద్ద ముగిసింది. ఉద్యోగులు, యువత, వివిధ వర్గాల ప్రజలు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 5K రన్‌లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, డీఆర్డీఓ రాథోడ్ రవీందర్, డీపీఓ రమేష్, సంక్షేమ అధికారి మిల్కా, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, క్రీడా కోచ్‌లు, అధికారులు, యువత, ఉద్యోగులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.