Home Blog Page 15

జొన్నల కొనుగోళ్లపై కలెక్టర్ రాజర్షిషా సమీక్ష: రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం

0

జొన్నల కొనుగోళ్లపై కలెక్టర్ రాజర్షిషా సమీక్ష: రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం

చిత్రం న్యూస్,ఆదిలాబాద్:

జిల్లాలో జొన్నల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి మరియు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, వ్యవసాయ, మరియు రవాణా శాఖల అధికారులతో కలిసి కొనుగోళ్లు, రవాణా అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మార్కెట్ యార్డును పరిశీలించిన అదనపు కలెక్టర్:  ఈ సమావేశానికి ముందే, అదనపు కలెక్టర్ ఆర్‌.ఎస్‌. చిత్రు మార్కెట్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డును క్షేత్రస్థాయిలో సందర్శించారు. యార్డులో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్లు, తూకం యంత్రాల పనితీరును ఆయన స్వయంగా తనిఖీ చేశారు. తూకంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం, మార్కెట్ యార్డ్ పరిశీలన కార్యక్రమాల్లో జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్క్‌ఫెడ్ డీఎం మహేష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదును సవాల్‌గా తీసుకోవాలి: మాజీ మంత్రి జోగు రామన్న 

0

సభ్యత్వ నమోదును సవాల్‌గా తీసుకోవాలి: మాజీ మంత్రి జోగు రామన్న 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త సవాల్‌గా తీసుకొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, జోగు రామన్న పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలకు సభ్యత్వ నమోదు, ఓటర్ అవగాహనపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతీక అయిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి కంది శ్రీనివాస రెడ్డి సన్మానం

0

మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి కంది శ్రీనివాస రెడ్డి సన్మానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ తన్వీర్ హైమద్‌లను కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లు కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయానికి గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి వారిని శాలువాతో సన్మానించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి కంది శ్రీనివాస రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

 

ఏబీవీపీ టీటీసీ ఉచిత కోచింగ్ ముగింపు

0
MLA PAYAL SHANKAR
MLA PAYAL SHANKAR

ఏబీవీపీ టీటీసీ ఉచిత కోచింగ్ ముగింపు

*ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఏబీవీపీ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీటీసీ ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యార్థులకు పాయల్ ఫౌండేషన్ తరఫున స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక సేవలో ఏబీవీపీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. జాతీయవాదం, దేశభక్తి, క్రమశిక్షణతో కూడిన విలువల విద్యను అందించడంలో ఏబీవీపీ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్, జిల్లా ప్రముఖ్ రవికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్, ఎంఈఓ సోమయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

జొన్నలు నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

0
Payal shankar
Payal shankar

జొన్నలు నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను నూటికి నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం సాత్నాల మండలం కాన్ప మేడిగూడ రైతు వేదికలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటికే అనేక కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో జొన్నలు కొనరేమోనన్న ఆత్రుతతో మార్కెట్ యార్డుల్లో రద్దీ నెలకొందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జొన్న పంట కోటా పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, బీజేపి నాయకులు రమేష్, ఎల్టి అశోక్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

 

 

 

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్ చిత్రం న్యూస్, బాసర :

0

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్

చిత్రం న్యూస్, బాసర :

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో బాసర సీఐ కిరణ్ కుమార్ గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై గ్రామస్తులకు, యువకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ కిరణ్ కుమార్,మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను తీసుకొని తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. యువత చదువుతో పాటు ఆయా రంగాల్లో రాణించాలని, మత్తు పానీయాలకు బానిస కాకూడదు అని తెలిపారు.  మైనర్లు వాహనాలు  నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాహన చోదకులు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు వాహనదారులు ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు . కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

బాసర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

0

బాసర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన 90 రోజుల హుండీ ద్వారా భారీ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనీదేవి తెలిపారు. గురువారం అక్షరాభ్యాస మండపంలో హుండీ ఆదాయం లెక్కించారు. ఇందులో 1 కోటి 03 లక్షల 75 వేల 308 రూపాయల ఆదాయం సమకూరగా..మిశ్రమ బంగారం 40.గ్రా.200మిల్లీ గ్రా, మిశ్రమ వెండి 02కిలోల 550గ్రాములు, విదేశీ కరెన్సీ 24 nos నోట్లు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో  ఏఈఓ గంగ ప్రసాద్, ఆలయ అధికారులు, బ్యాంకు సిబ్బంది, స్వచ్ఛంద సేవ భక్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

0

విద్యాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

చిత్రం న్యూస్, బాసర: విద్యాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు.బుధవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నరసింహ కళ్యాణమండపంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సర్పంచులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలోఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా నిరంతరం సర్పంచుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భోజన వసతి తో పాటు, మెరుగైన సౌకర్యాలు కల్పించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు పూనుకుందని, ముథోల్ లో రూ.225 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు, సర్పంచులు కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావ్ పటేల్ తో పాటు, మండల అధికారులు పాల్గొన్నారు.

పదో తరగతి విద్యార్థులకు అభ్యసన మెరుగుదల తరగతులు ప్రారంభం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

0

పదో తరగతి విద్యార్థులకు అభ్యసన మెరుగుదల తరగతులు ప్రారంభం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గెజిటెడ్ నెంబర్-1)లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక అభ్యసన మెరుగుదల తరగతులను (Learning Improvement Classes) జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఈ ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సోమయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, డీసీఈబీ సెక్రటరీ గజేందర్, ఏఏంఓలు లక్ష్మణ్, అజయ్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

నిబద్ధతతో సేవలందించి రోగుల నమ్మకాన్ని పొందాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

0

నిబద్ధతతో సేవలందించి రోగుల నమ్మకాన్ని పొందాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సేవా దృక్పథంతో పనిచేస్తూ రోగుల ప్రాణాలు కాపాడే నర్సులు, వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించి ప్రజల నమ్మకాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవ’ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం నర్సులతో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిదని, రోగుల కోలుకోవడంలో వారి సేవలు అత్యంత కీలకమని కొనియాడారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు నర్సులను కలెక్టర్ ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ వేడుకల్లో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ సూపరింటెండెంట్ నరేందర్, నర్సింగ్ సూపరిండెంట్లు కల్పన, రమాదేవి, ఉమతో పాటు ఇతర వైద్య అధికారులు, పెద్ద సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.