Home Blog Page 12

బాసర అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

0

బాసర అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

చిత్రం న్యూస్, బాసర : దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్బా జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి శుక్రవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకార పూజలను చేశారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు నిర్వహిస్తే ప్రయోజకులుగా మారుతారని భక్తుల నమ్మకం. అమ్మవారి దర్శనం కోసం ఉమ్మడి రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు బాసర పోలీస్ సిబ్బంది,తగిన ఏర్పాట్లు చేశారు.

కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్యకు బీజేపీ శ్రేణుల ఘన సన్మానం

0

 కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్యకు బీజేపీ శ్రేణుల ఘన సన్మానం

చిత్రం న్యూస్, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య ను బీజేపీ కిసాన్ మోర్చా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సతీష్ చంద్ర, సోషల్ మీడియా రాష్ట్ర కో-కన్వీనర్ సాయి తేజ కలిసి ఘనంగా సన్మానించారు. కిసాన్ మోర్చా అభివృద్ధికి, రైతు సమస్యల పరిష్కారానికి ఆయన అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం కిసాన్ మోర్చా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.

 నకిలీ ఎరువుల రాకెట్ గుట్టురట్టు: ఇద్దరు అరెస్ట్

0

 నకిలీ ఎరువుల రాకెట్ గుట్టురట్టు: ఇద్దరు అరెస్ట్

చిత్రం న్యూస్, జైనథ్: అమాయక రైతులే లక్ష్యంగా సాగుతున్న నకిలీ ఎరువుల విక్రయాల ముఠా ఆట కట్టించారు. జైనథ్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో ఈ నకిలీ ఎరువుల రాకెట్ గుట్టురట్టయింది.

నల్గొండ జిల్లాకు చెందిన  ఏపురి కృష్ణయ్య, జైనథ్ మండలం కంట గ్రామానికి చెందిన బట్ట మహేందర్‌గా నిందితులను గుర్తించి, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడులలో నిందితుల నుండి 60 నకిలీ ఎరువుల బస్తాలతో పాటు ఒక కారు, బైక్, మొబైల్ ఫోన్లు, నకిలీ బిల్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పంట దిగుబడిని, భూసారాన్ని కాపాడుకోవడానికి రైతులు కేవలం గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని అధికారులు సూచించారు.

జనాభా గణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన కలెక్టర్ రాజర్షి షా

0

జనాభా గణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జాతీయ జనాభా గణన సర్వేలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రక్రియను పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని మొబైల్, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రజలంతా సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో సెన్సెస్ నోడల్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం

0

ఆదిలాబాద్‌లో జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీనివాస్, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, క్రీడా కోచ్‌లు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విజయ డైరీ నూతన డిప్యూటీ డైరెక్టర్‌గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

0

విజయ డైరీ నూతన డిప్యూటీ డైరెక్టర్‌గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: విజయ డైరీ నూతన డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.ఈ సందర్భంగా జిల్లాలో పాల ఉత్పత్తుల అభివృద్ధి, రైతులకు అందించే సేవలు, విజయ డైరీ చేపడుతున్న కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు. పాడి రైతుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, విజయ డైరీ ద్వారా అందించే సౌకర్యాలపై సమీక్షించారు.

రాజీవ్ గాంధీ సేవలు యువతకు స్ఫూర్తి: డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్

0

రాజీవ్ గాంధీ సేవలు యువతకు స్ఫూర్తి: డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కో-ఆర్డినేటర్ కుసుమ్ ఆలం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డా. నరేష్ జాదవ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. యువతకు పెద్దపీట వేశారని, పంచాయతీరాజ్ చట్టం ద్వారా మహిళలకు అవకాశం కల్పించారని కొనియాడారు. దేశంలో ఐటీ రంగానికి పునాది వేసి భారత్ ఐటీ రంగంలో ముందుండడానికి కారణమయ్యారని తెలిపారు. దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల కోసం తన జీవితాన్ని సమర్పించారని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో తమిళనాడులో అసాంఘిక శక్తుల చేతిలో స్వర్గస్తులవడం బాధాకరమని, ఆయన ఇంకొన్ని రోజులు బతికి ఉంటే దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా “ఉగ్రవాద వ్యతిరేక దినం”గా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ సెద్మకి ఆనంద్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజార్ పాషా, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు బండి దేవిదాస్ చారీ, గౌలి సంజయ్, సుమ, మందకిని, ఉయకే అనసూయ, మున్సిపల్ కౌన్సిలర్ స్వాతి మంగేష్, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధే టీజీబీ లక్ష్యం

0

గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధే టీజీబీ లక్ష్యం

* వెన్నంపల్లిలో నూతన శాఖ ప్రారంభం

* ‘మన గ్రామం – మన అభివృద్ధి’ ‘పేరిట గ్రామసభ

* కరీంనగర్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్

చిత్రం న్యూస్, సైదాపూర్ ప్రతినిధి: గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) నిరంతరం కృషి చేస్తోందని కరీంనగర్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ అన్నారు. వెన్నంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన టీజీబీ బ్రాంచ్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించేందుకు “మన గ్రామం – మన అభివృద్ధి” అనే నినాదంతో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల డిపాజిట్లు, వ్యవసాయ, వ్యాపార, విద్యా రుణాలతో పాటు ప్రభుత్వ సబ్సిడీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాన్యులకు భద్రత కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాల ప్రాముఖ్యతను వివరించారు. ఖాతాదారులకు మరింత చేరువయ్యేందుకు ఏఈపీఎస్, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఆధునిక, డిజిటల్ సేవలను బ్యాంక్ అందిస్తోందని తెలిపారు. బ్యాంకు సేవలను విస్తృతంగా వినియోగించుకుంటూ గ్రామ సమగ్రాభివృద్ధికి భాగస్వాములు కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ రాజు, ఉప్పల్-కె చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆపరేషన్స్ సీనియర్ మేనేజర్ సుబ్బారావు, బిజినెస్ సీనియర్ మేనేజర్ వంశీకృష్ణ, వెన్నంపల్లి బ్రాంచ్ మేనేజర్ నాగేంద్ర పాల్గొన్నారు. అలాగే పరిసర ఆరు గ్రామాల సర్పంచులు చిరంజీవి, శ్రీకాంత్, లావణ్య, స్వప్న, అనితతో పాటు పలువురు సైదాపుర్ పాక్స్ ఇన్చార్జ్ పర్సన్ కొత్త తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, గ్రామ పెద్దలు, ఖాతాదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్

0

మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్  రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని బుధవారం హైదరాబాద్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రములో రోడ్ల అభివృద్ధికి పెద్ద మొత్తంలో హమ్ పథకంలో నిధులు ఇచ్చిన మంత్రి ఆయురారోగ్యాలతో ఉండి రాష్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి మరింత పేరు ప్రతిష్టలు పొందాలని ఎమ్మెల్యే పటేల్ ఆకాంక్షించారు.. హమ్ పథకంలో నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

బాసర ఆర్జీయూకేటీలో అడ్మిషన్ల ప్రక్రియ: ప్రత్యేక కేటగిరీల ధ్రువపత్రాల పరిశీలన 

0

బాసర ఆర్జీయూకేటీలో అడ్మిషన్ల ప్రక్రియ: ప్రత్యేక కేటగిరీల ధ్రువపత్రాల పరిశీలన 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసర క్యాంపస్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ షెడ్యూలు ప్రకారంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం క్యాంపస్‌లో ప్రత్యేక కేటగిరీలైన ఎన్ సీ సీ (NCC), క్యాప్ (CAP – Children of Armed Personnel) కోటా విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ విజయవంతంగా ప్రారంభమైంది.

ప్రత్యేక కోటా కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, నిపుణులు నిశితంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ (Sainik Welfare Department) ప్రతినిధులు, ఎన్ సీ సీ డైరెక్టరేట్ అధికారులు స్వయంగా పాల్గొని, విద్యార్థుల కేటగిరీల వారీగా పూర్తిస్థాయిలో ధ్రువీకరణ చేపట్టారు.

ఈ సందర్భంగా అడ్మిషన్ల విభాగం కన్వీనర్ మాట్లాడుతూ.. విద్యార్థులు సమర్పించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, వారు సాధించిన గ్రేడ్లు, ప్రాధాన్యత క్రమాన్ని బట్టి అధికారులు తుది మెరిట్ జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతిభావంతులకే సీట్లు కేటాయించబడతాయని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ పరిశీలన ప్రక్రియ పూర్తయిన అనంతరం, ఎంపికైన విద్యార్థుల వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తాజా సమాచారం కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.rgukt.ac.in ను క్రమం తప్పకుండా సందర్శించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్ల విభాగం కన్వీనర్, కో-కన్వీనర్, ఇతర అధికారులు, అడ్మిషన్ల సిబ్బంది పాల్గొని వెరిఫికేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు.