వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన దహిగావ్ గ్రామ సర్పంచ్ భోక్రె శంకర్
చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దహిగావ్ గ్రామంలో బాల వికాస ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ భోక్రె శంకర్ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా మూతబడిన పాడైపోయిన వాటర్ ప్లాంట్ ను పునఃరుద్దరించామన్నారు. ఈ ఎండాకాలంలో ప్రజల దాహార్తి కోసం ప్లాంటును ప్రారంభించామన్నారు. ప్రస్తుతం మినరల్ వాటర్ తాగుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే మినరల్ వాటర్ తాగే వారు. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా మినరల్ వాటర్ తాగుతున్నారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఈ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించానన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రసూన్ రెడ్డి, ఫీల్డ్ కోఆర్డినేటర్ నరేందర్ బోయర్, గ్రామస్తులు రాందాస్ నాక్లే, హులేకే బాపూరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

