-Advertisement-

మైనారిటీ విభాగం బలోపేతానికి ఐక్యంగా ముందుకు సాగాలి-షాహిద్ అలీ

మైనారిటీ విభాగం బలోపేతానికి ఐక్యంగా ముందుకు సాగాలి-షాహిద్ అలీ

చిత్రం న్యూస్,ఇచ్చోడ:మైనారిటీ విభాగం బలోపేతానికి ఐక్యంగా ముందుకు సాగాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం చైర్మన్ షాహిద్ అలీ పిలుపునిచ్చారు. ఇచ్చోడ మండల కేంద్రంలో వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా మైనారిటీ చైర్మన్ షాహిద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్‌మెంట్‌ను మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా వివిధ మండలాలకు నూతన మైనారిటీ మండల అధ్యక్షుల ఎంపిక, మండల కార్యవర్గాల ఏర్పాటు, పార్టీ కార్యక్రమాల్లో మైనారిటీ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం వంటి అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. మైనారిటీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు పటిష్టంగా నిర్మించేందుకు నాయకులు సమన్వయంతో పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ సంస్థాగతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని షాహిద్ అలీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో బోథ్ నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా, మాజీ సిరికొండ మండల అధ్యక్షులు షేక్ ఇమామ్, మాజీ బోథ్ అసెంబ్లీ అధికార ప్రతినిధి యండి సద్దాం, సీనియర్ నాయకులు బోథ్ మండల ప్రధాన కార్యదర్శి అబుద్, మాజీ ఎంపీటీసీ జాహిద్ మొహియుద్దీన్, సీనియర్ నాయకులు మొహమ్మద్, మహబూబ్, షేక్ యూసఫ్, సాదిక్, మజీద్ ఖాన్, మాజీ మండల మైనారిటీ చైర్మన్ అబ్దుల్ రషీద్, షేక్ ఇక్బాల్, షఫీ, హాసన్, వహీద్, ఆత్మ డైరెక్టర్ రహిమొద్దీన్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ అబ్రార్, సయ్యద్ సల్మాన్, అలీం, ఖాజా భాయి, షేక్ తాజముల్, వివిధ మండలాల మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments