సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన దళిత, గిరిజన సంఘాల నాయకులు
చిత్రం న్యూస్,అదిలాబాద్: సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్ మెంట్ జిల్లా కార్యదర్శి బిక్కి గంగన్న, ఆదిమ కోలాం గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనేరావు మరియు దళిత సంఘాల నాయకులు పాల్గొని సిఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత మరియు తెలంగాణ ఉద్యమకారుల పక్షపాతి అని రుజువైందని నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణ, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, అంబేద్కర్ అభయ హస్తం కింద స్వయం ఉపాధి కోసం 12 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించడం హర్షణీయమని వారు తెలిపారు.
