శనగ పంట కొనుగోలు చేయాలని రైతుల ధర్నా: మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల సబ్ మార్కెట్ యార్డులో గత 15 రోజుల నుంచి ప్రభుత్వం రైతుల శనగపంట కొనుగోలు చేయకపోవడంతో శనివారం రైతులు ధర్నా చేపట్టారు.మండల బీఆర్ఎస్ నాయకులు రైతులకు మద్దతుగా 353బీ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్ మాట్లాడుతూ మండలంలో రైతులు 5,600 ఎకరాలల్లో శనగ పంట పండిస్తే కనీసం ఇప్పటివరకు ఈ ప్రభుత్వం 20% కూడా కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు వెన్ను దన్నుగా ఉండి అన్ని విధాల ఆదుకుంటే, ఈ ప్రభుత్వ మాత్రం రైతుల పేరిట శాపంగా మారిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సంబంధిత మార్క్ఫెడ్ డీఎంతో చరవాణిలో మాట్లాడించారు. సోమ, మంగళవారాల్లో కచ్చితంగా శనగ కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చి రైతులకు నచ్చజెప్పారు దీంతో వారు శాంతించి ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖోడే విపిన్, నాయకులు గోడే విశాల్, మధుకర్ భలేరావు, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.




