-Advertisement-

సింగపూర్‌లో విద్యా విధానంపై ఉపాధ్యాయుల శిక్షణ పూర్తి

సింగపూర్‌లో విద్యా విధానంపై ఉపాధ్యాయుల శిక్షణ పూర్తి

చిత్రం న్యూస్ బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలానికి చెందిన ఉపాధ్యాయుడు చొప్డే రాజు,  జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు శిక్షణ కోసం పంపించింది.  రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల ఉపాధ్యాయుల అవగాహన పర్యటన, విద్యా మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు సింగపూర్ విద్యా వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడి ఆధునిక బోధనా పద్ధతులు, విద్యార్థులకు అందిస్తున్న విద్యా విధానాలు, పాఠశాలల నిర్వహణ, ఉత్తమ విద్యా పద్ధతులపై అవగాహన పొందారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలానికి చెందిన ఉపాధ్యాయుడు చొప్డే రాజు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు రోజుల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని నేడు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు చొప్డే రాజు ‘చిత్రం న్యూస్’ తో మాట్లాడుతూ.. సింగపూర్‌లో అమలవుతున్న విద్యా విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా అనేక కొత్త విషయాలను నేర్చుకున్నామని తెలిపారు. అక్కడి ఉత్తమ బోధనా పద్ధతులను తెలంగాణ పాఠశాలల్లో అమలు చేయడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments