-Advertisement-

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, బాసర : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి,విగ్రహానికి కుల పెద్దలు, గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, రజక యూత్ సభ్యులు, గ్రామ ప్రజలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ…తెలంగాణ మట్టి ఆత్మగౌరవ పోరాటానికి, దొరల అన్యాయాలపై తిరుగుబాటుకు ఐలమ్మ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఆమె పోరాట పటిమ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం కుల పెద్దలు, రజక యూత్ నాయకులు మాట్లాడుతూ. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం చివరలో “జై రజక.. జై జై రజక”, “చాకలి ఐలమ్మ అమర్ రహే” అంటూ చేసిన నినాదాలతో ప్రాంగణం మారుమోగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments