-Advertisement-

కాప్రి గ్రామంలో ఘనంగా ‘అంగన్ మిలన్’ సేవా కార్యక్రమం

కాప్రి గ్రామంలో ఘనంగా ‘అంగన్ మిలన్’ సేవా కార్యక్రమం

చిత్రం న్యూస్: జైనథ్: జైనథ్ మండలం కాప్రి గ్రామంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘అంగన్ మిలన్’ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ టీచర్ ను జిల్లా మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ నిపుంగే దివ్య, స్థానిక నాయకులు, గ్రామస్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిపుంగే దివ్య మాట్లాడుతూ మాట్లాడుతూ.. దేశంలో, గ్రామాల్లో సేవా కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జనరల్ సెక్రటరీ రవీందర్, బీజేపీ సీనియర్ నాయకులు కుసుమ రామన్న, మార్కండే, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ దుర్ల సురేష్,గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments