యాల్ల సాయిస్మృతికి రూ.2 లక్షల నగదు బహుమతి
గవర్నర్ శివ ప్రతాప్ చేతుల మీదుగా అందజేత
చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థిని యాల్ల సాయి స్మృతికి అరుదైన గౌరవం లభించింది. 2025–26 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల విభాగంలో జిల్లా టాపర్గా నిలిచిన ఆమెకు శ్రీరామ్ చిట్ ఫండ్ సంస్థ తరఫున రూ.2 లక్షల నగదు బహుమతి అందజేశారు. హైదరాబాద్లోని ESCI క్యాంపస్లో నిర్వహించిన సెంటినరీ కన్వెన్షన్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా సాయి స్మృతి ఈ బహుమతిని అందుకున్నారు. కార్యక్రమంలో ZPSS జైనథ్ ప్రధానోపాధ్యాయులు మద్ది లస్మన్న, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రస్తుతం సాయి స్మృతి IIIT బాసర (RGUKT)లో సీటు సాధించి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

